ETV Bharat / international

భారత్​ను ఆదుకోవాలని బైడెన్​కు సెనేటర్ల వినతి - భారత్ అమెరికా

రెండో దశ విజృంభణతో భారత్​లో కరోనా కేసుల పెరుగుదలపై అమెరికా చట్టసభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. భారత్​కు టీకాలు సహా వైద్య సహకారం అందించాలని బైడెన్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.

COVID-19 situation in India,  US lawmakers
భారత్​లో కరోనా, అమెరికా
author img

By

Published : Apr 23, 2021, 1:22 PM IST

భారత్​లో కరోనా కేసుల ఆకస్మిక పెరుగుదలపై అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. భారత్​కు తగిన సహకారం అందించాలని అధ్యక్షుడు జో బైడెన్​ను కోరారు.

"అమెరికన్లకు కావాల్సిన దానికన్నా ఎక్కువ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. భారత్​కు తక్షణ సహకారం కావాలన్నది విస్మరించలేని సత్యం. వారిని ఆదుకోవడం మా నైతిక బాధ్యత."

-ఎడ్వర్డ్​ మార్కీ, డెమొక్రటిక్ సెనేటర్

భీకరమైన రెండో దశ కొవిడ్​తో పోరాడుతోన్న భారత్​లోని మిత్రులకు అండగా ఉంటామని విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గ్రెగరీ మీక్స్​ అన్నారు. భరించలేని వేదన అనుభవిస్తోన్న కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు హేలీ స్టీవెన్స్ తెలిపారు. ఈ మహమ్మారిని అంతమొందించడానికి అంతర్జాతీయ సమాజం సమన్వయం కావాలని కోరారు.

అమెరికాలో సుమారు 4 కోట్ల మిగులు ఆస్ట్రాజెనెకా టీకాలున్నాయని భారత అమెరికన్ చట్టసభ్యుడు రోహిత్ ఖన్నా తెలిపారు. అవి అందజేస్తే ఉపయుక్తంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

రెండో దశ కరోనా ఉద్ధృతితో భారత ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిందని ఆర్థికవేత్త రమణన్ లక్ష్మీనారాయణ్ అభిప్రాయపడ్డారు. భారత్​లో వైద్య సదుపాయాలను మెరుగుపర్చడానికి పలు ఇండో అమెరికన్ బృందాలు నిధులు సమకూర్చుతున్నాయి.

ఇదీ చూడండి: అమెరికాలో కొత్త రాష్ట్రానికి ప్రతినిధుల సభ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.