ETV Bharat / international

'శీతకాలంలో ఫ్లూతో కలిసి కరోనా ముప్పేట దాడి!'

అమెరికాలో కరోనా కట్టడి విషయంలో శాస్త్రీయంగా వ్యవహరించకపోతే వైరస్ ఉగ్రరూపం దాల్చుతుందని అంటువ్యాధుల నిపుణులు స్పష్టం చేశారు. శీతకాలంలో సీజనల్​గా వచ్చే ఫ్లూ వ్యాధితో కలిసి అమెరికా ఆరోగ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని హెచ్చరించారు.

VIRUS-US-WINTER
'శీతకాలంలో ఫ్లూతో కలిసి కరోనా ముప్పేట దాడి'
author img

By

Published : May 14, 2020, 2:10 PM IST

కరోనా వైరస్ మరోమారు విజృంభించకుండా చూసేందుకు నిర్ణయాత్మక చర్యలు చేపట్టకపోతే అమెరికాలో పరిస్థితి తీవ్రమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంఫ్లూయెంజా వైరస్​తో కలిసి అమెరికా చరిత్రలో ఈ శీతకాలం చీకటిని మిగుల్చుతుందని తెలిపారు అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ రిక్ బ్రైట్.

హెచ్చరించినందుకే వేటు..

కరోనా వైరస్​కు సంబంధించి సంసిద్ధంగా ఉండాలని ట్రంప్ ప్రభుత్వానికి హెచ్చరించిన కారణంగా తనను బాధ్యతల నుంచి తప్పించినట్లు బ్రైట్ ఆరోపిస్తున్నారు. సంక్షోభం ప్రారంభం సమయంలో వ్యాక్సిన్​ అభివృద్ధికి పెట్టుబడులు, ఔషధాల నిల్వలు పెంచాలని సూచనలకు ప్రతిగా తనకు విమర్శలు ఎదురయ్యాయని తెలిపారు. బ్రైట్​ను తొలగించేందుకు ఆయన చేసిన సూచనలే కారణమంటూ అమెరికాకు చెందిన ఓ నిఘా సంస్థ కూడా మద్దతు పలికింది.

VIRUS-US-WINTER
డాక్టర్​ రిక్​ బ్రైట్​, అమెరికా శాస్త్రవేత్త

విధ్వంసం తప్పదు..

తనను బాధ్యతల నుంచి తప్పించడంపై అమెరికా చట్టసభ పరిధిలోని ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు బ్రైట్. కమిటీ ముందు ఇవాళ తన వాదనలు వినిపించనున్నారు. ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలను కమిటీ వెబ్​సైట్​లో పోస్ట్ చేశారు. తాము చేసిన సూచనలను పాటించకపోతే రాబోయే రోజుల్లో విధ్వంసం తప్పదని హెచ్చరించారు.

"జాతీయ సమన్వయంతో శాస్త్రీయ విధానాలతో స్పందించకపోతే ఈ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతుంది. దీర్ఘకాలం వేధిస్తుంది. ఫలితంగా బాధితులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతుంది.

ఈ శీతకాలంలో వైరస్​ తిరగతోడుతుందనేది కాదనలేని నిజం. అప్పుడు సీజనల్​గా వచ్చే ఇంఫ్లూయెంజాతో కలిసి విజృంభించే అవకాశం ఉంది. దీని వల్ల దేశ ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. నాతో నా బృందం సూచించిన చర్యలు తీసుకోకపోతే 2020 శీతకాలం అమెరికా చరిత్రలో అత్యంత చీకటి రోజులను మిగుల్చుతుంది."

- రిక్​ బ్రైట్​, జీవవైద్య శాస్త్ర ఆధునిక పరిశోధన, అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త

ఫౌచీ తరహాలోనే..

అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణడు ఆంటోనీ ఫౌచీ ఈ వారం చేసిన సూచనలకు.. బ్రైట్ వాదనలు దగ్గరిగా ఉన్నాయి. ఆంక్షల ఎత్తివేతపై హడావుడిగా నిర్ణయం తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు ఫౌచీ.

ఇదీ చూడండి: 'భారత్​పై ఫిర్యాదు చేసినందుకే నాపై ట్రంప్ వేటు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.