ETV Bharat / international

'పారిస్'​ నుంచి అధికారికంగా వైదొలిగిన అమెరికా - paris deal trump

పారిస్​ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ప్రకటించిన మూడేళ్లకు ఆ ప్రక్రియ పూర్తయింది. ఈ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం బుధవారం అధికారికంగా తప్పుకుంది.

US formally exits Paris climate deal
'పారిస్'​ నుంచి అధికారికంగా వైదొలిగిన అమెరికా
author img

By

Published : Nov 4, 2020, 3:00 PM IST

పారిస్​ ఒప్పందం నుంచి అమెరికా బుధవారం అధికారికంగా వైదొలిగింది. ఒప్పందం నుంచి తప్పుకోనున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించిన మూడేళ్లకు ఈ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న తరుణంలో ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.

2017లో ట్రంప్​ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించి 2019లో ఐక్యరాజ్య సమితికి నోటిఫికేషన్​ అందించింది అమెరికా. తాజాగా.. బుధవారం ఒప్పందం నుంచి అగ్రరాజ్యం వైదొలిగింది.

భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్​, అంతకన్నా తక్కువకు నియంత్రించాలని ఒప్పందం చెబుతోంది. అయితే ఈ ఒప్పందంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, 2025నాటికి 2.5 మిలియన్​ ఉద్యోగాలు కోల్పోతామని ట్రంప్​ ఆరోపించారు. అందుకే ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి- 'ఎన్నికల్లో మోసం'పై సుప్రీంకు వెళ్తాం: ట్రంప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.