అమెరికాలో కరోనా కేసులు గత రెండు వారాలుగు స్థిరంగా పెరుగుతున్నందున వైరస్ కట్టడికి ఔషధ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 18 ఏళ్ల పైబడిన వారందరూ కరోనా టీకా బూస్టర్ డోసు(booster news) తీసుకునేందుకు అర్హులని తెలిపింది. క్రిస్మస్ దగ్గరపడుతున్న తరుణంలో వైరస్ వ్యాప్తి మరింత పెరిగే ముప్పు ఉందని గ్రహించి బుస్టర్ డోసుకు అవకాశమిచ్చింది. ఈ విషయాన్ని ఫైజర్, మోడెర్నా సంస్థలు ప్రకటించాయి. ఇప్పటికే అమెరికాలోని 10 రాష్ట్రాల్లో కొందరికి బూస్టర్ డోసు ఇస్తున్నారు(booster dose news). ఇప్పుడు ఔషధ నియంత్రణ మండలి(fda latest news) తీసుకున్న నిర్ణయంతో అమెరికాలోని అందరూ బూస్టర్ డోసు తీసుకొవచ్చు. అయితే ఇందుకు అమెరికా అంటువ్యాధుల నిపుణుల కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. శుక్రవారం దీనిపై సమావేశమై నిర్ణయం తీసుకోనుంది.
అమెరికాలో ఫైజర్, మోడర్నా టీకాలను ఇప్పటికే కోట్ల మందికి ఇచ్చారు. జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు కూడా ఆమోదం లభించింది. ఫైజర్ 10వేల మంది వాస్తవ డేటాను పరిశీలించి.. బూస్టర్ డోసు(covid booster dose news) వల్ల వైరస్ నుంచి మరింత రక్షణ లభిస్తున్నట్లు నివేదిక సమర్పించాక ఎఫ్‌డీఏ తాజా నిర్ణయం తీసుకుంది. అయితే బూస్టర్ డోసుగా వేరే టీకా తీసుకోవచ్చా? అని ఇప్పటివరకు సందిగ్ధం ఉండేది. ఇప్పుడు వేరే టీకాలను కూడా బూస్టర్ డోసుగా తీసుకోవచ్చని ఎఫ్‌డీఏ స్పష్టతనిచ్చింది.
అమెరికాలో ఇకపై ఫైజర్, మోడెర్నా రెండు డోసులు తీసుకున్నవారు 6 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకొవచ్చు(boosters to all adults). వారికి నచ్చిన టీకాను ఎంపిక చేసుకోవచ్చు. జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు తీసుకున్న వారు కనీసం రెండు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది.
అమెరికాలో 19.5కోట్ల మంది ఇప్పటికే రెండు డోసుల టీకా తీసుకున్నారు. 3 కోట్ల మంది బూస్టర్ డోసు కూడా వేయించుకున్నారు(covid booster dose usa). అయితే ఎఫ్‌డీఏ నిర్ణయంతో ఇంకా ఒక్క డోసు కూడా టీకా తీసుకోని 6 కోట్ల మందికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో వృద్ధులకు, కరోనా ముప్పు అధికంగా ఉన్న వారికి, దీర్ఘకాలిక రోగులకు బూస్టర్ డోసు ఇప్పటికే ఇస్తున్నారు. ఎఫ్‌డీఏ ఇప్పుడు 18 ఏళ్లు నిండిన వారందరికీ దీన్ని విస్తరింపజేసింది(booster news latest).
కరోనా కారణంగా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది అమెరికా. ఆ దేశంలో ఇప్పటివరకు 4కోట్ల 83లక్షల 99వేల కేసులు నమోదయ్యాయి. దాదాపు 7లక్షల 90వేల మంది వైరస్‌కు బలయ్యారు. మరణాలు ఇంత అధికంగా మరే ఇతర దేశంలోనూ నమోదు కాలేదు.
ఇదీ చదవండి: కమలా హారిస్‌కు అమెరికా అధ్యక్ష బాధ్యతలు!