ETV Bharat / international

భారత్​కు టీకా సాయంలో పంతం వీడని అమెరికా! - అమెరికా జో బైడెన్​ టీకా విధానం

భారత్​లో కొవిడ్​ టీకా ఉత్పత్తికి అవసరమయ్యే ముడి పదార్థాల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని అమెరికా ఇప్పట్లో సడలించేలా కనిపించడం లేదు. తమ దేశ ప్రజల అవసరాలకే తాము మొదటి ప్రాధాన్యమిస్తామని ఆ దేశం పేర్కొంది. అనంతరమే ఇతర దేశాలకు తాము సాయం చేస్తామని తెలిపింది.

vaccines
కొవిడ్​ టీకా ఉత్పత్తి ముడి పదార్థాల ఎగుమతులపై అమెరికా నిషేధం
author img

By

Published : Apr 23, 2021, 3:37 PM IST

దేశంలో కొవిడ్​ వ్యాక్సిన్​ ఉత్పత్తికి అవసరమయ్యే ముడి పదార్థాల ఎగుమతులపై నిషేధం విషయంలో అమెరికా తన వైఖరిని మార్చుకునేలా కనిపించటం లేదు. అమెరికా ప్రజల అవసరాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వడమే అధ్యక్షుడు జో బైడెన్​ ప్రథమ బాధ్యత అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఆ తర్వాతే పరిస్థితిని బట్టి ఇతర దేశాలకు తాము సాయం చేస్తామని తెలిపారు.

"అమెరికన్లందరికీ టీకా వేయడంలో ఇప్పుడు మా దేశం నిమగ్నమై ఉంది. ఆ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది అమెరికన్​ ప్రజల ఆరోగ్యం మాకు ఉన్న ప్రత్యేక శ్రద్ధ. రెండోది.. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా అమెరికానే ఎక్కువ ప్రభావితం కావటం. మా దేశంలో 5.50 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది వైరస్​ బారిన పడ్డారు. అమెరికన్లకు టీకా వేయడం అనేది ఒక్క మా దేశం ప్రయోజనం కోసం మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ప్రయోజనాల కోసం కూడా. మిగతా దేశాల కోసం మేం ఎంత చేయాలో అంత చేస్తాం. కానీ, అమెరికన్లకే మేం మొదటి ప్రాధాన్యం ఇస్తాం."

- నెడ్​ ప్రైస్​, అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి.

వ్యాక్సిన్‌ తయారీకి కావాల్సిన ముడి పదార్థాల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలనే భారత విన్నపాన్ని సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని బైడెన్​ ప్రభుత్వం ఇటీవల హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నెడ్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఇదీ చూడండి: భారత్​ను ఆదుకోవాలని బైడెన్​కు సెనేటర్ల వినతి

ఇదీ చూడండి: భారత్‌లో వ్యాక్సిన్​లకు అమెరికా అడ్డుపుల్ల.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.