ETV Bharat / international

అక్కడ 6 లక్షలు దాటిన కరోనా మరణాలు

author img

By

Published : Jun 16, 2021, 5:31 AM IST

Updated : Jun 16, 2021, 6:47 AM IST

అమెరికాలో కొవిడ్-19 విలయతాండవం కొనసాగుతోంది. అక్కడ కరోనా మహమ్మారి ధాటికి ఆరు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్దఎత్తున కొనసాగుతున్న టీకా పంపిణీతో కరోనా మృతుల సంఖ్య తగ్గుతున్నట్లు జాన్​ హాప్​కిన్స్ విశ్వవిద్యాలయం పేర్కొంది.

VIRUS-US-DEATH-TOLL
అక్కడ 6 లక్షలు దాటిన కరోనా మరణాలు

రోజురోజుకూ కొత్తరూపు సంతరించుకుంటూ మానవాళిని అతలాకుతలం చేస్తున్న కొవిడ్‌ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ఇప్పటి వరకు కేసుల సంఖ్య, మరణాల నమోదులో ముందు వరుసలో ఉన్న అమెరికాలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య మంగళవారానికి 6 లక్షలు దాటింది.

అమెరికాలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అమలవుతుండడంతో కరోనా తీవ్రత తగ్గి మరణాల సంఖ్య గత కొన్ని నెలలుగా తగ్గుముఖం పడతున్నట్లు జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాలు తెలుపుతున్నాయి.

గత జనవరి నాటికి అమెరికాలో రోజూ 3000 మరణాలు సంభవించాయి. ఆదివారం 360 మంది మరణించారు. జులై నాలుగో తేదీ వరకు అమెరికాలో 60 ఏళ్లు దాటిన వారిలో 70 శాతం మందికి కనీసం వ్యాక్సిన్‌ ఒక డోస్‌ అందించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

సగం మందికి టీకా..

ఇక యూఎస్‌ జనాభాలో సగం జనాభాకు పైగా కనీసం ఒక డోసు పొందినట్లు, 43 శాతం జనాభా పూర్తి స్థాయిలో టీకా తీసుకున్నట్లు సీడీసీ తెలిపింది. ఇక ప్రపంచంలో కేసుల పరంగా అమెరికా ముందు వరుసలో ఉంది. ఇప్పటికే ఆ దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 3.34 కోట్లు దాటింది. వారిలో 3.28 లక్షల ప్రజలు కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారు.

ఇవీ చదవండి: అమెరికాలో 10 నెలల కనిష్ఠానికి కరోనా మరణాలు

టీకా తీసుకున్నాం.. ఏమేం పనులు చేయొచ్చు​?

Last Updated : Jun 16, 2021, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.