ETV Bharat / international

అమెరికాపై కొవిడ్​ పంజా- ఒక్కరోజే 1.32లక్షల కేసులు

అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. వరుసగా మూడోరోజు కూడా అగ్రరాజ్యంలో లక్ష మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. కొవిడ్​ కేసులు, మరణాల పరంగా అగ్రస్థానంలో ఉన్న ఆ దేశంలో.. మొత్తం బాధితుల సంఖ్య కోటి మార్క్​ను దాటింది.

US COVID-19 CASES CROSSED ONE CRORE MARK WITH 10,058,586 NEW CASES IN LAST 24 HOURS
అగ్రరాజ్యంపై కొవిడ్​ పంజా- కోటి దాటిన కేసులు
author img

By

Published : Nov 7, 2020, 1:54 PM IST

అమెరికాలో కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య కోటి మార్క్​ను దాటింది. వరుసగా మూడో రోజు కూడా లక్షకుపైగా కొవిడ్‌ కేసులు వెలుగుచూశాయి. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1లక్షా 32వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. మరో 1,248 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం కేసులు 1కోటి 58వేల 586కు చేరుకున్నాయి. వారిలో 2లక్షల 42వేల 230 మందిని కొవిడ్​ బలితీసుకుంది. టెక్సాస్‌, ఇల్లినోయి, మిన్నెసోటా, కాలిఫోర్నియా, ఫ్లొరిడా, విస్కాన్సిన్‌ వంటి ప్రాంతాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. శ్వేతసౌధం చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మార్క్‌ మెడోస్‌కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

ఇదీ చదవండి: జంతువు నుంచి కొవిడ్ యాంటీబాడీల సేకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.