ETV Bharat / international

హెచ్​-1బీ వీసాలపై అమెరికా కోర్టు కీలక తీర్పు

అమెరికా కోర్టు.. హెచ్​-1బీ వీసా జారీ విషయంలో కీలక తీర్పునిచ్చింది(h1b visa latest news). ప్రస్తుతమున్న లాటరీ విధానాన్ని కాకుండా.. వేతనాల ఆధారంగా వీసాదారులను ఎంపిక చేయాలన్న ట్రంప్​ కాలం నాటి ప్రతిపాదనను కొట్టివేసింది.

US court sets aside proposed Trump-era rule on H-1B visa selection
హెచ్​-1బీ వీసాపై అమెరికా కోర్టు కీలక తీర్పు
author img

By

Published : Sep 18, 2021, 3:08 PM IST

హెచ్​-1బీ వీసా జారీ విషయంలో కీలక తీర్పును వెలువరించింది అమెరికా కోర్టు(h1b visa latest news). ప్రస్తుతమున్న లాటరీ విధానాన్ని పక్కనపెట్టి.. వేతనాల ఆధారంగా వీసాలను ఎంపిక చేయాలన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కాలం నాటి ప్రతిపాదనను కొట్టివేసింది.

ట్రంప్​ హయాంలో తీసుకొచ్చిన నిబంధన విషయంలో నాటి ఆపద్ధర్మ హోంమంత్రి చాడ్​ ఓల్ఫ్​.. తన విధులను చట్టబద్ధంగా నిర్వర్తించలేదని కాలిఫోర్నియాలోని జిల్లా న్యాయమూర్తి జెఫ్రీ ఎస్​ వైట్​ పేర్కొన్నారు. అందువల్ల ట్రంప్​ కాలం నాటి ప్రతిపాదనను కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు(h1b visa lottery).

అమెరికాలో పనిచేసేందుకు విదేశీయులకు ఇచ్చేదే ఈ హెచ్​-1బీ వీసా. భారత్​, చైనా వంటి దేశాల నుంచి.. వేలాది మంది సాంకేతిక నిపుణులను అమెరికా టెక్​ సంస్థలు ప్రతి ఏటా తీసుకుంటాయి. అయితే ఏడాదికి 65వేల వీసాలే జారీ చేస్తారు. అదనంగా మరో 20వేల వీసాలు రిజర్వులో ఉంటాయి. ప్రస్తుతం.. 'ఫస్ట్​ కమ్​-ఫస్ట్​ సర్వ్​'(ముందువచ్చిన వారికి వీసా)- 'లాటరీ' విధానాలను కలగలిపి వీసాలు జారీ చేస్తున్నారు(h1b visa lottery system).

ఈ విధానాన్ని మారుస్తూ.. ట్రంప్​ అధ్యక్షుడిగా ఉన్న చివరి రోజుల్లో.. యూఎస్​సీఐఎస్​(అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్​ సేవల) విభాగం ఆదేశాలు జారీ చేసింది. లాటరీ పద్ధతిని పక్కనపెట్టి.. వేతనాల ఆధారంగా వీసాలివ్వాలని నిర్ణయించింది. అమెరికా ప్రజల ప్రయోజనాలు, అత్యున్నత ప్రతిభ ఉన్న విదేశీయులకు లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

వాస్తవానికి ఈ నిబంధన ఈ ఏడాది మార్చి9న అమల్లోకి రావాల్సి ఉంది. కానీ బైడెన్​ ప్రభుత్వం.. ఈ నిబంధన అమలును ఈ ఏడాది డిసెంబర్​ 31కు వాయిదా వేసింది.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.