అమెరికా కాంగ్రెస్ సభలో మరో కీలక బిల్లుపై నేడు ఓటింగ్ జరగనుంది. గ్రీన్‌కార్డు వితరణలో దేశాల వారీ కోటాను తొలగించాలన్న బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. కోటా విధానం మార్చి... నైపుణ్యం ఉన్నవారికే పౌరసత్వ కల్పించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.
435 మంది సభ్యులున్న అమెరికా ప్రతినిధుల సభలో 310 మందికి పైగా సభ్యులు ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. ఇందులో 203 మంది డెమొక్రాట్లు, 108 మంది రిపబ్లికన్లు ఉన్నారు. కాంగ్రెస్‌లో ఎలాంటి అభ్యంతరాలు, సవరణలు లేకుండా బిల్లు ఆమోదం పొందడానికి 290 మెజారిటీ ఉంటే సరిపోతుంది. ఫలితంగా బిల్లు నెగ్గటం ఖాయంగానే కనిపిస్తుంది. ఈ బిల్లును 'హెచ్ఆర్-1044'గా పిలుస్తున్నారు.
భారతీయులకు ప్రయోజనం
ఈ బిల్లుతో గ్రీన్‌కార్డు కోసం దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న అనేక భారతీయులకు లబ్ధి చేకూరనుంది. దేశాలవారీ కోటాను తీసేస్తే హెచ్-1బీ వీసా ద్వారా వెళ్లే భారతీయులకు పౌరసత్వం త్వరగా లభిస్తుంది.
ఇటీవల కొన్ని నివేదికల ప్రకారం హెచ్-1బీ వీసాపై వచ్చిన భారత ఐటీ నిపుణులకు గ్రీన్‌కార్డు పొందాలంటే కనీసంగా 70 ఏళ్ల పడుతుంది.
బిల్లులోని మరిన్ని అంశాలు
- కుటుంబ ఆధారిత వీసాలకు దేశాలవారీ కోటా 7 నుంచి 15 శాతానికి పెంపు
- ఉపాధి ఆధారిత వీసాలకు 7 శాతం కోటా తొలగింపు.
- వీసా అనుమతికి ఉన్నత చదువు, అసాధారణమైన సామర్థ్యం, నైపుణ్యం, పెట్టుబడిదారులకు ప్రాధాన్యం.
- ఒక దేశానికి 85 శాతానికి మించి వీసా జారీ కుదరదు.
దిగువ సభ ఆమోదం తర్వాత సెనేట్‌కు ఓటింగ్‌కు వెళుతుంది. అక్కడ ఆమోదం లభిస్తే అమెరికా అధ్యక్షుడి సంతకంతో చట్టంగా రూపొందుతుంది.
ఇదీ చూడండి: భారతీయులకు మరింత సులభంగా గ్రీన్‌కార్డ్!