ETV Bharat / international

భారత్​-చైనా ఉద్రిక్తతలపై శ్వేతసౌధం ఆందోళన

భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై బైడెన్ సర్కార్ తొలిసారి స్పందించింది. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొంది. చైనా తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నట్లు తెలిపింది. కాలిఫోర్నియాలో గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండించింది.

US concerned by Beijing's pattern of ongoing attempts to intimidate neighbours: WH NSC
డ్రాగన్ చర్యలు ఆందోళనకరం: శ్వేతసౌధం
author img

By

Published : Feb 2, 2021, 11:26 AM IST

చైనా దుందుడుకు వైఖరిపై అమెరికా స్పందించింది. పొరుగుదేశాలను భయభ్రాంతులకు గురిచేసేలా డ్రాగన్ తీరు ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. భారత్-చైనా సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొంది.

"పరిస్థితిని పరిశీలిస్తున్నాం. భారత్-చైనా ప్రభుత్వాల మధ్య జరుగుతున్న చర్చలను గమనిస్తున్నాం. ప్రత్యక్ష చర్చల ద్వారా సరిహద్దు సమస్యకు శాంతియుత పరిష్కారం రావాలని కోరుకుంటున్నాం. పొరుగువారిని భయానికి గురిచేసేలా చైనా వరుస ప్రయత్నాలు చేయడంపై అమెరికా ఆందోళనగా ఉంది."

-ఎమిలీ జే హార్న్, శ్వేతసౌధ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి

ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రతలకు అమెరికా ప్రాధాన్యం ఇస్తుందని ఎమిలీ స్పష్టం చేశారు. ఇందుకోసం అమెరికా మిత్రదేశాలు, భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. చైనా-భారత్ సరిహద్దు ఉద్రిక్తతలపై బైడెన్ యంత్రాంగం స్పందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

గాంధీ విగ్రహ ధ్వంసంపై

కాలిఫోర్నియాలోని దావిస్​లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు అపవిత్రం చేయడాన్ని శ్వేతసౌధం ఖండించింది. ఈ ఘటనను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

దావిస్ నగర యంత్రాంగం సైతం ఈ ఘటనను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆస్తులు ధ్వంసం చేసే చర్యలకు తమ మద్దతు ఉండదని పేర్కొంది. ఈ ఘటన వల్ల మనోభావాలు దెబ్బతిన్నవారికి సానుభూతి ప్రకటించింది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను జవాబుదారీని చేస్తామని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో గాంధీ విగ్రహం ఉన్న సెంట్రల్ పార్కులో భారతీయ అమెరికన్లు దీక్ష చేపట్టారు. రాత్రంతా పార్కులోనే ఉండి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన దావిస్ మేయర్ గ్లోరియా పార్టిడా... విగ్రహాలు ధ్వంసం చేసే చర్యలను ఎప్పటికీ క్షమించేది లేదని పేర్కొన్నారు. గాంధీ తమకు ప్రేరణ అని చెప్పారు.

'ట్రంప్​ను మిస్సవ్వట్లేదు'

మాజీ అధ్యక్షుడిపై శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ గురించి శ్వేతసౌధం ఎక్కువగా ఆలోచించడం లేదని పేర్కొన్నారు.

"నమ్మడానికి కష్టంగా అనిపించినా.. ఆయన గురించి మాట్లాడుకోవడానికి, ఆలోచించడానికి మేం ఎక్కువగా సమయాన్ని వెచ్చించడం లేదు."

-జెన్ సాకి, వైట్​హౌస్ ప్రెస్ సెక్రెటరీ

ట్రంప్​పై ట్విట్టర్ నిషేధం విధించడంపైనా స్పందించారు సాకి. ఆయన లేకపోవడం వల్ల శ్వేతసౌధంలో పని తేలికగా జరిగిపోతుందా అని విలేకరి ప్రశ్నించగా.. 'ప్యాకేజీకి మద్దతిచ్చేందుకు ఆలోచిస్తున్న రిపబ్లికన్ సభ్యులను ఈ ప్రశ్న అడిగితే బాగుండేది' అని అన్నారు. ట్విట్టర్​లో ఆయన్ను మిస్ అవుతున్నామని మేమైతే చెప్పలేమని బదులిచ్చారు.

ఇదీ చదవండి: 'మార్పులు చేస్తే 'ప్యాకేజీ'తో ప్రయోజం ఉండదు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.