ETV Bharat / international

'ఇరాక్​ నుంచీ అమెరికా బలగాల ఉపసంహరణ' - బరాక్ ఒబామా

సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలుకుతూ ఇరాక్‌ నుంచి బలగాల ఉపసంహరణకు అమెరికా నిర్ణయించింది. ఈ ఏడాది చివరి నాటికి ఇరాక్‌ నుంచి బలగాలు వెనక్కి వచ్చే ప్రక్రియ పూర్తవుతుందని అగ్రరాజ్యాధినేత జో బైడెన్‌ తెలిపారు. సైన్యం కోసం అధికంగా ఖర్చవుతుండడం వల్ల ఇప్పటికే అఫ్గానిస్థాన్‌ నుంచి తమ సైన్యాన్ని వెనక్కి రప్పించే ప్రక్రియను అమెరికా చేపట్టింది. తాజాగా ఇరాక్‌ నుంచి కూడా బలగాలను ఉపసంహరించుకోనుంది.

US troops in Iraq
అమెరికా
author img

By

Published : Jul 27, 2021, 4:15 PM IST

సైన్యం కోసం భారీగా ఖర్చులు పెరుగుతుండడం, ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం వల్ల ఇటీవలే అఫ్గానిస్థాన్‌ నుంచి తమ బలగాలను వెనక్కి రప్పిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. తాజాగా ఇరాక్‌ నుంచి సైతం బలగాల ఉపసంహరణకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు. సద్దాం హుస్సేన్‌ హయాంలో ఇరాక్‌లో సామూహిక విధ్వంసం సృష్టించే మారణాయుధాలు ఉన్నాయనే కారణంతో 2003లో ఇరాక్‌పై అమెరికా నేతృత్వంలోని కూటమి యుద్ధం ప్రకటించింది. సద్దాంను పదవి నుంచి దింపారు కానీ అలాంటి ఆయుధాలు అక్కడ లభ్యంకాలేదు. 2011లో ఇరాక్‌ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించినా మళ్లీ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్ర సంస్థతో పోరుకు బలగాలను అక్కడకు తరలించాల్సి వచ్చింది. గత కొన్నేళ్లుగా ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రమూకలతో పోరాటంలో ఇరాక్‌ సైన్యానికి అమెరికా బలగాలు సహకారం అందిస్తున్నాయి. 2001 సెప్టెంబర్‌ 11న అమెరికాలో ఉగ్రదాడి అనంతరం ముష్కర మూకల ఏరివేత కోసం అమెరికా సైన్యాన్ని అఫ్గానిస్థాన్‌కు పంపింది. దీనికి తోడు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రసంస్థకు పుట్టినిల్లు అయిన ఇరాక్‌, సిరియాలో సైనిక దళాలకు ఉగ్రవాదులపై పోరులో అమెరికా సహకారం అందిస్తోంది.

సహాయం కొనసాగింపు..'అఫ్గాన్​లో పట్టుబిగిస్తున్న తాలిబాన్లు'

ఇరాక్‌ ప్రధాని ముస్తఫా అల్‌ కదామీతో సమావేశమైన జో బైడెన్‌.. బలగాల ఉపసంహరణపై చర్చించారు. ప్రస్తుతం ఇరాక్‌లో 2500 మంది అమెరికా సైనికులు ఉన్నారన్న బైడెన్‌.. ఈ ఏడాది చివరి నాటికి బలగాల ఉపసంహరణ పూర్తవుతుందని వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌నకు వ్యతిరేకంగా.. ఇరాక్ పోరాటంలో ఆమెరికా సైన్యం సహాయం చేస్తూనే ఉంటుందని బైడెన్ అన్నారు. శిక్షణ, సలహా, భద్రతా పరమైన అంశాలపై దృష్టి సారిస్తుందని ప్రకటించారు. ఇరాక్‌లో ఉగ్రమూకలు.. అమెరికా బలగాల స్థావరాలపై దాడి చేసే అవకాశం ఉందని.. దానివల్ల తమ సైనికులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదని గుర్తుచేశారు. ఇప్పటికే చాలా సార్లు ఇరాన్‌కు మద్దతిచ్చే మిలీషియా దళాలు అమెరికా దళాలపై దాడులు జరిపాయి. ఉగ్రవాదంతో తమ పోరు ఎప్పటికీ కొనసాగుతుందని బైడెన్‌ చెప్పారు.

కొరవడిన స్పష్టత..

మరోవైపు ఈ ఏడాది చివరినాటికి ఇరాక్‌లో ఎంతమంది సైనికులు ఉంటారనే అంశంపై అమెరికా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాక్‌లో.. అమెరికా బలగాలను తగ్గించారు. అప్పటి వరకు 3 వేల మంది ఉండగా.. ఆ సంఖ్యను 2500కు తగ్గించి మిగతా వారిని వెనక్కి రప్పించినట్లు అమెరికా సైనికవర్గాలు తెలిపాయి. 2017లోనే ఇరాక్‌ ప్రభుత్వం ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదంపై విజయం సాధించినట్లు ప్రకటించింది. కానీ.. ఇప్పటికీ ఇరాక్‌లో ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గత వారం బాగ్దాద్‌ మార్కెట్‌లో జరిగిన బాంబు దాడిలో 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. చాలామంది గాయాలపాలయ్యారు. ఈ దాడి తామే చేసినట్లు ఇస్లామిక్‌ స్టేట్‌ సంస్థ ప్రకటించింది.

ఇరాక్​ సైన్యానికి శిక్షణ..

ఇరాక్‌లో ఉగ్రవాదంపై పోరులో ఇతర దేశాల సహకారం ఇక అవసరం లేదని.. గత వారమే ఇరాక్‌ ప్రధాని ముస్తఫా అల్‌ కదామీ అన్నారు. ఇప్పటివరకు ఉగ్రవాదంపై పోరులో తమకు సహకరించిన అమెరికాకు.. ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు.. 2014లో అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇరాక్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఇరాక్‌ సైన్యానికి అమెరికా బలగాలు శిక్షణ ఇవ్వాల్సి ఉంది.

ఇదీ చూడండి:

'అఫ్గాన్​లో మా మిషన్​ పూర్తి కాలేదు'

'అఫ్గాన్​లో పట్టుబిగిస్తున్న తాలిబాన్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.