అమెరికాలో నైపుణ్య ఉద్యోగుల కొరతను దృష్టిలో ఉంచుకుని హెచ్-1బీ వీసాల జారీని రెట్టింపు చేయాలని యూఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్.. జో బైడెన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.
గ్రీన్ కార్డు జారీ కోసం ప్రవాసీయులు ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోందని.. దాని వల్ల ఉద్యోగుల కొరత తీవ్రమవుతుందని తెలిపింది. అందువల్ల ఆ విధానాన్ని రద్దు చేయాలని కోరింది. గ్రీన్ కార్డు కోటా కింద కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని ఇచ్చే హెచ్-1బీ వీసా విధానాన్ని రద్దు చేసి, ఒక్కొక్కరికి ఇచ్చేలా మార్పులు చేయాలని సూచించింది. దాంతో ప్రస్తుతం 65,000 వీసాల జారీని రెట్టింపు చేయవచ్చని తెలిపింది. ఇంకా ఇమిగ్రేషన్ చట్టాల్లో మార్పులు చేయాలని కోరింది.
ఇదీ చదవండి: H1B: వారికి ఊరట- ట్రంప్ పాలసీకి స్వస్తి!