ETV Bharat / international

టీకా వేసుకుంటే బీరు ఉచితం! - అమెరికాలో టీకా తీసుకుంటే బీర్​ ఫ్రీ

సాధారణంగా ఏ దేశంలోనైనా ఎన్నికల వేళ.. ప్రజలను రాజకీయ పార్టీలు 'ఉచిత' హామీలతో ఆకట్టుకోవడం చూస్తుంటాం! కానీ, అమెరికాలో ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేకపోయినా.. ఉచిత పంపకాల కార్యక్రమం నడుస్తోంది. కారణం- కొవిడ్​ టీకా! వ్యాక్సిన్లు వేసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు గానూ.. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు కంపెనీలూ అనేక ఉచిత హామీలు గుప్పిస్తున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒకలా ఈ తాయిలాల వర్షం కురుస్తోంది.

Vaccine, Beer
వ్యాక్సిన్​, బీర్​
author img

By

Published : May 23, 2021, 10:49 AM IST

Updated : May 23, 2021, 11:33 AM IST

మే నెలలో వ్యాక్సిన్​ వేసుకుంటే ఉచితంగా బీర్లు, వైన్​ ఇస్తామని ఒకరంటే.. మ్యూజియాలు, పార్కుల్లోకి ఉచిత ప్రవేశమని ఇంకొకరు ప్రకటించారు. 50 లక్షల డాలర్ల లాటరీ టికెట్​ ఉచితమని మరొకరు హామీ ఇస్తున్నారు. 25 డాలర్ల గిఫ్ట్​ కూపన్లు, ఏడు రోజులు మెట్రోరైలులో ఉచిత ప్రయాణం కార్డు, వచ్చే ఏడాది సూపర్​బౌల్​ టికెట్లు.. ఇలా అమెరికన్లపై టీకా కోసం తాయిలాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్నాయి.

ఎందుకీ తాయిలాలంటే?

ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా టీకాలను సమకూర్చుకుని, వేగంగా ప్రజలందరికీ ఇవ్వడం మొదలుపెట్టిన అమెరికాలో ఉన్నట్టుండి గత కొద్దివారాలుగా ఈ ప్రక్రియ మందగించింది. ఆ దేశ మొత్తం జనాభా సుమారు 33 కోట్లు. వారిలో సుమారు 16 కోట్ల మందికి(38 శాతం) టీకా రెండు డోసులూ అందింది. అత్యధికంగా ఏప్రిల్​ 1న ఒక్కరోజే 40 లక్షల డోసులు వేశారు. కానీ, ఆ తర్వాత నుంచి క్రమంగా టీకా వేసుకునే వారి సంఖ్య తగ్గుతోంది. ఈ నెల 17న కేవలం 10 లక్షల మోతాదులే అందించారు. దీంతో ప్రజల్ని టీకాల దిశగా ఆకట్టుకోవడానికి ప్రభుత్వం, కంపెనీలు కలసి ఇలా ప్రోత్సాహకాలు ప్రకటించడం మొదలెట్టాయి.

US vaccination
అమెరికాలో వ్యాక్సిన్​ లెక్కలు ఇలా..

గవర్నర్​ దంపతులతో కలసి భోజనం

న్యూయార్క్​ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి.. రాష్ట్ర గవర్నర్​ దంపతులతో కలసి భోజనం చేసే ఆఫర్​ ఇచ్చింది. ఇందుకోసం ఏకంగా.. ఓ ఆన్​లైన్ పోటీయే మొదలుపెట్టింది! ఇప్పటివరకు టీకా వేసుకున్న 18 ఏళ్లు పైబడిన వారెవరైనా ఆన్​లైన్​లో తమ పేరు నమోదు చేసుకుని ఈ పోటీలో పాల్గొనవచ్చు. లాటరీ ద్వారా ఎంపిక చేసిన వారికి గవర్నర్​ దంపతులతో కలసి వారింట్లోనే భోజనం చేసే అవకాశం కల్పిస్తారు.

ఇదీ చదవండి: '148 మంది అథ్లెట్లకు టీకా.. 17 మందికి రెండు డోసులు'

మరికొన్ని తాయిలాలివీ..

  1. బైడెన్​ ప్రభుత్వం ఉబర్​, లిఫ్ట్​ రవాణా సంస్థలతో ఓ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. అదేంటంటే.. ఎవరైతే కరోనా టీకా వేయించుకోవడానికి వెళతారో.. వారిని ఆ సంస్థల వాహనాల్లో ఉచితంగా తీసుకెళ్లి, తీసుకొస్తారు.
  2. ఫిలడెల్ఫియాలోని కొన్ని కంపెనీలు టీకా తీసుకున్న తమ ఉద్యోగులకు 100 నుంచి 200 డాలర్లు ప్రోత్సాహకంగా చెల్లిస్తున్నాయి. సెప్టా అనే స్థానిక కంపెనీ 100 డాలర్లు; లిడిల్​ అనే సూపర్​ మార్కెట్​ తమ ఉద్యోగులకు 200 డాలర్లు ప్రోత్సాహకాలుగా ప్రకటించాయి.
  3. షికాగోలో టీకా వేయించుకున్నవారికి ఈ వేసవిలో సాగే సంగీత విభావరులకు ఉచిత పాసులిస్తున్నారు.
  4. కనెక్టికట్​లోని రెస్టారెంట్లు.. టీకాలు వేసుకున్నవారికి తమ దగ్గర ఆహారం కొంటే పానీయాలు ఉచితమంటున్నాయి.
  5. న్యూజెర్సీలో ఈ నెలలోపు టీకా వేసుకున్న 21 ఏళ్లు పైబడిన వారికి.. ఎంపిక చేసిన షాపుల్లో ఉచితంగా బీర్లు అందనున్నాయి.
  6. వెస్ట్​ వర్జీనియాలో టీకాలు వేయించుకున్న(16-35 సంవత్సరాల్లోపు) వారికి 100 డాలర్ల సేవింగ్​ బాండ్లు ఇవ్వాలనుందని గవర్నర్ ప్రకటించారు. దీని సాధ్యాసాధ్యాలపై ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారట!
  7. న్యూయార్క్​లో 18 ఏళ్లు పైబడిన వారు టీకా తీసుకుంటే.. వారికి 20 డాలర్ల విలువైన(50 లక్షల డాలర్ల బహుమతి) లాటరీ టికెట్​ ఉచితంగా ఇస్తున్నారు.

ఇదీ చదవండి: మౌంటెన్ మారథాన్​లో పాల్గొన్న 21 మంది మృతి

Last Updated : May 23, 2021, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.