ETV Bharat / international

Viral: అతని సమయస్ఫూర్తి.. వారి ప్రాణాలను కాపాడింది - నేషనల్​ చెర్రి ఫెస్టివల్​

వినోదం కోసం ఎక్కిన అమ్యూజ్​​మెంట్​ రైడ్​.. చేదు అనుభవం మిగిల్చింది. గాలిలో ఉండగా ఆ యంత్రం దాదాపు ఊడిపోయింది. కానీ ఓ వ్యక్తి సమయ స్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన అమెరికా మిచిగాన్​లో జరిగింది.

ride out of control
నేషనల్​ చెర్రి ఫెస్టివల్​
author img

By

Published : Jul 11, 2021, 12:54 PM IST

అమెరికా మిచిగాన్​లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. 'నేషనల్​ చెర్రి ఫెస్టివల్​' నేపథ్యంలో ఓ కార్నివాల్​లో ఏర్పాటు చేసిన ఓ అమ్యూజ్​మెంట్​ రైడ్.. ఔత్సాహికులకు చేదు అనుభవం మిగిల్చింది. ఈ 'మ్యాజిక్​ కార్పెట్​ రైడ్​'లో ఎక్కి, పైకి వెళ్లేవరకు అంతా బాగానే ఉంది. కానీ మధ్యలో ఆ కార్పెట్​ రైడ్​ కింది భాగం దాదాపు ఊడిపోయింది.

దీంతో ఆ సమయంలో గాలిలో ఊగుతున్న వారు తీవ్ర భయాందోళనలకు గురై అరవడం మొదలుపెట్టారు. చుట్టుపక్కన ఉన్న చాలామంది భయంతో అక్కడే నిలిచిపోయారు. కానీ వారి మధ్యలో ఉన్న ఓ వ్యక్తి మాత్రం.. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యంత్రం కిందిభాగంపై నిలబడ్డాడు. అతడిని అనుసరిస్తూ మరికొందరు ఆ యంత్రంపై నిలబడగా.. అది పడిపోకుండా ఉన్న చోటే స్థిరపడింది. ఫలితంగా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇక రైడ్​ని ఆపేయగా.. లోపల ఉన్న వారు బయటకు వచ్చి అక్కడ ఉన్నవారిని భావోద్వేగంతో హత్తుకున్నారు. తమను కాపాడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ దృశ్యాలను అక్కడి వారు ఫోన్లలో చిత్రీకరించగా.. ఇప్పుడు అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. సమయ స్ఫూర్తి ప్రదర్శించి ఆ యంత్రంపై నిలబడిన ఆ వ్యక్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. అతను అలా చేయకపోయుంటే పరిస్థితి ఎలా ఉండేదో అన్న ఆలోచన వస్తేనే భయంగా ఉందని అంటున్నారు.

ఈ ప్రమాదం తర్వాత నిర్వాహకులు ఆ రైడ్​ను పూర్తిగా నిలిపివేశారు.

ఇదీ చూడండి:- వాష్​ రూంకు వెళ్లిన వ్యక్తి.. కొండచిలువ ఎంత పని చేసిందంటే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.