ETV Bharat / international

'అలా చేయకపోతే..చైనా నుంచి మరో మహమ్మారి'

కరోనా వైరస్ ప్రపంచాన్ని చట్టుముట్టి ఏడాది గడుస్తున్నా, ఇప్పటికీ చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ తప్పుడు సమాచారాన్నే ప్రచారం చేస్తోందని ఆరోపించింది అమెరికా. వైరస్​ మూలాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తోన్న దర్యాప్తును అడ్డుకుంటోందని తెలిపింది. చైనాను జవాబుదారీగా చేయకపోతే.. డ్రాగన్​ దేశం నుంచి మరో మహమ్మారి ఉద్భవిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో.

Mike Pompeo
అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో
author img

By

Published : Dec 19, 2020, 5:56 PM IST

కరోనావైరస్ మూలాలను శోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తును చైనా అడ్డుకుంటోందని అమెరికా ఆరోపించింది. ఈ వైరస్ వ్యాప్తి విషయంలో అంతర్జాతీయ సమాజం చైనాను జవాబుదారీ చేయాలని అమెరికా విదేశంగా మంత్రి మైక్ పాంపియో డిమాండ్‌ చేశారు. తగిన సమయంలో సమాచారం ఇవ్వకపోవడం వల్లే ప్రపంచమంతా ఈ వైరస్ గుప్పిట్లో చిక్కుకుందని అగ్రదేశం వీలుచిక్కినప్పుడల్లా చైనాపై మండిపడుతూనే ఉంది. ఆ వైరస్‌ను 'చైనా వైరస్' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది.

"కరోనావైరస్ ప్రపంచాన్ని చట్టుముట్టి ఏడాది గడుస్తున్నా, ఇప్పటికీ చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ తప్పుడు సమాచారాన్నే ప్రచారం చేస్తోంది. వైరస్ పుట్టుక, వ్యాప్తికి సంబంధించి ఆరోగ్య సంస్థ చేస్తోన్న దర్యాప్తును అడ్డుకుంటోంది. చైనా తయారు చేసిన టీకాల విషయంలో పారదర్శకత కొరవడంతో పాటు, క్లినికల్ ట్రయల్స్‌ గురించి సమాచారం ఇవ్వకుండా..వాటిని ప్రజలకు అందజేస్తోంది. ఈ తీరు చైనా పౌరులను, ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తుంది"

- మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి.

10లక్షలకు పైగా మరణాలకు కారణమై, భారీ సంఖ్యలో ప్రజల జీవనోపాధిని దూరం చేసిన ఈ వైరస్‌పై చైనాను అంతర్జాతీయ సమాజం జవాబుదారీని చేయాలని ఆయన కోరారు పాంపియో. ఒకవేళ అలా చేయకపోతే, భవిష్యత్తులో మరో మహమ్మారికి ఈ దేశం కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, చైనా వుహాన్‌ నగరంలోని ఆహారపు మార్కెట్లో వైరస్ మొదట వెలుగుచూసిందని యావత్‌ ప్రపంచం భావిస్తోంది. దీనిపై దర్యాప్తు జరిపేందుకు ఆరోగ్య సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ నిపుణుల బృందం వచ్చే నెలలో చైనాలో పర్యటించనుంది. ఈ క్రమంలో వుహాన్ యంత్రాంగం స్పందించింది. తాము దర్యాప్తునకు భయపడటం లేదని, వైరస్ ఇక్కడ ఉద్భవించలేదనే విషయం తేటతెల్లమవుతుందని వెల్లడించింది.

ఇదీ చూడండి: మరో 59 చైనా కంపెనీలపై అమెరికా ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.