జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనను అడ్డుకున్న చైనాపై ఐరాస భద్రతా మండలిలోని పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చైనా తన తీరును మార్చుకోకపోతే ఇతర మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుందని హెచ్చరించాయి.
"అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడాన్ని చైనా అడ్డుకుంటే మేము ఇతర మార్గాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. పరిస్థితి అంత వరకు రాకుడదని కోరుకుంటున్నాం."
---- భద్రతా మండలిలోని ఓ దౌత్యవేత్త.
అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణించాలన్న భారత్ ప్రతిపాదనను డ్రాగన్ దేశం అడ్డుకోవడం ఇది నాలుగోసారి.
దేశంలోని ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను కొనసాగించడం కోసం.. చైనా సహాయం తీసుకుంటున్న పాకిస్థాన్‌పై మరో సభ్య దేశం మండిపడింది. ఎట్టిపరిస్థితుల్లోనైనా మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని తేల్చిచెప్పింది.