ETV Bharat / international

'కరోనా సంక్షోభంతో 5 కోట్ల మంది కడు పేదరికంలోకి!' - ఆహార అత్యవసర పరిస్థితి

కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల మందికి పైగా ఆకలితో అలమటిస్తున్నారని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆహార అత్యవసర స్థితి ఏర్పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలను హెచ్చరించారు. చిన్న పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు, వృద్ధులకు పోషకాహారం అందేలా చూడాలని ఆయన సూచించారు.

UN warns against global food emergency
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్
author img

By

Published : Jun 10, 2020, 10:12 AM IST

Updated : Jun 10, 2020, 12:05 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఆహార అత్యవసర స్థితి ఏర్పకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్.. సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల మందికిపైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న దాదాపు 14 కోట్ల మంది పిల్లల్లో సరైన ఎదుగుదల లేదని గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ జనాభాకు సరిపడిన దానికంటే ఎక్కు ఆహారమే ఉత్పత్తి అవుతున్నప్పటికీ పేదల ఆకలి తీర్చడంలో మన ఆహార వ్యవస్థలు విఫలమవుతున్నట్లు వ్యాఖ్యానించారు.

కరోనా సంక్షోభం వల్ల దాదాపు 49 మిలియన్ల ప్రజలు కడు పేదరికంలోకి జారిపోయారని గుటెరస్ వివరించారు. పరిస్థితి ఇలానే కొనసాగితే.. ప్రపంచం ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆహార ఉత్పత్తులకు మూలమైన వ్యవసాయదారులను కాపాడుకోవాల్సిన అవసరముందని ఆయన అన్నారు. చిన్న పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు, వృద్ధులకు పోషకాహారం అందేలా చూడాలని గుటెరస్ సూచించారు.

ఇదీ చూడండి: వివాదాస్పద మ్యాపుపై నేపాల్ పార్లమెంటులో చర్చ

Last Updated : Jun 10, 2020, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.