ETV Bharat / international

ప్రపంచ దేశాలన్నింటికీ కరోనా టీకా​ అవసరమే - guterus on carona vaccin

ప్రపంచ దేశాలన్నింటికీ ధనిక దేశాలు కరోనా వ్యాక్సిన్​ను అందుబాటులో ఉంచాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ నొక్కిచెప్పారు. అమెరికా దిగ్గజం ఫైజర్​తో కలిసి పనిచేస్తున్న జర్మన్​ శాస్త్రవేత్తలను జర్మనీ పార్లమెంట్​ ప్రసంగంలో పొగిడారు.

UN head stresses need of virus vaccine for all nations
ప్రపంచ దేశాలన్నింటికీ కరోనా వాక్సిన్​ అవసరం: ఆంటోనియో గుటెరస్
author img

By

Published : Dec 19, 2020, 11:58 AM IST

ధనిక దేశాలు తమ పౌరులకు కరోనా వ్యాక్సిన్​ను అందించడంతో.. ప్రపంచంలో అందరికీ టీకా అందుబాటులో ఉండేలా చూడాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ నొక్కిచెప్పారు. జర్మనీ పార్లమెంట్​ను ఉద్దేశించి​ ప్రసంగించిన ఆయన.. ఫైజర్​ సంస్థతో కలిసి పనిచేస్తున్న ఆ దేశ శాస్త్రవేత్తలను పొగిడారు.

"జర్మన్ శాస్త్రవేత్తల విజయాలు గర్వంచదగ్గవి. ప్రపంచంలో​ అందరికి వ్యాక్సిన్​ను అందుబాటులో ఉంచడమే మన ధ్యేయం.ఇది ప్రజల వాక్సిన్."

-ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి​​

వ్యాక్సిన్​ పట్ల ప్రజల్లో శాస్త్రీయ నమ్మకం కలిగేలా ఐరాస చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉందని గుటెరస్​ అన్నారు. సైన్స్​పై ప్రజల్లో అపనమ్మకం కలిగించే ప్రజాదరణ పొందిన విధానాలను ప్రపంచం చూసిందని ఆయన అన్నారు. మహమ్మారి కాలంలో దేశాన్ని నడిపించడంలో జర్మనీ ఛాన్స్​లర్​ విజయం సాధించారని కొనియాడారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.