ETV Bharat / international

డబ్ల్యూహెచ్ఓలోకి అమెరికా పునరాగమనంపై ఐరాస హర్షం

డబ్ల్యూహెచ్​ఓలో అమెరికా తిరిగి చేరడాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ స్వాగతించారు. అమెరికా నిర్ణయం వల్ల ప్రపంచ దేశాలకు సమానంగా టీకా పంపిణీ చేయాలన్న తమ ప్రణాళికలకు సహకారం లభిస్తుందని అన్నారు.

un-chief-welcomes-us-re-engagement-with-who
డబ్ల్యూహెచ్​ఓలో అమెరికా చేరడంపై ఐరాస హర్షం
author img

By

Published : Jan 21, 2021, 9:06 AM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)తో అమెరికా తిరిగి జట్టుకట్టడంపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన.. కరోనాపై పోరులో డబ్ల్యూహెచ్ఓకు సహకారం అందించడం అత్యంత కీలకమని అన్నారు. తద్వారా ప్రపంచంలోని అన్ని దేశాలకు సమానంగా కరోనా వ్యాక్సిన్ అందించాలన్న కార్యక్రమానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.

"వైరస్​ను అడ్డుకోవడానికి, ఇతర ప్రతికూల పరిణామాలను నివారించడానికి అంతర్జాతీయ సమాజం ఐక్యంగా పనిచేయాల్సిన సమయమిది. కొవిడ్ పోరులో వ్యాక్సినే ముఖ్యమైన సాధనం. అమెరికా డబ్ల్యూహెచ్​ఓలో తిరిగి చేరడం, కొవాక్స్ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం ద్వారా అన్ని దేశాలకు టీకా అందించాలన్న సంకల్పానికి ఊతం లభిస్తుంది."

-ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి

ప్రపంచస్థాయిలో సరైన సహకారం లేనందునే మహమ్మారి ప్రభావం తీవ్రమైందని పేర్కొన్నారు గుటెరస్. వ్యాక్సిన్ పంపిణీలో జాతీయవాదాన్ని అనుసరించడం మంచిది కాదన్నారు.

డబ్ల్యూహెచ్​ఓలో 1948 జూన్ 21 నుంచి సభ్యదేశంగా కొనసాగుతోంది అమెరికా. ఈ సంస్థకు అత్యధిక నిధులు అందిస్తూ వస్తోంది. అయితే కరోనా విషయంలో పారదర్శకంగా వ్యవహరించలేదని డబ్ల్యూహెచ్​ఓపై ఎప్పటికప్పుడు నిప్పులు చెరిగారు అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సంస్థకు అందించాల్సిన నిధులను నిలిపివేశారు. అయితే, ట్రంప్ ఆదేశాలను వెనక్కి తీసుకుంటూ.. కార్యనిర్వాహక ఉత్తర్వులపై అధ్యక్షుడు బైడెన్ సంతకం చేశారు.

ఇదీ చదవండి: డబ్ల్యూహెచ్​ఓ నుంచి వైదొలుగుతున్న అమెరికా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.