ETV Bharat / international

"శాంతిని కొనసాగించండి"​

పాకిస్థాన్​ తన చెరలో ఉన్న భారత పైలట్​ అభినందన్​ను విడుదల చేయడాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ స్వాగతించారు. ఇరుదేశాలు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.

ఆంటోనియో గుటెరస్, ఐరాస కార్యదర్శి
author img

By

Published : Mar 2, 2019, 1:22 PM IST

భారత​ పైలట్​ అభినందన్​ను పాకిస్థాన్​ విడుదల చేయడాన్ని ఐక్యరాజ్యసమితి స్వాగతించింది. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగటం శుభపరిణామమని, ఇరుదేశాలు శాంతిని కొనసాగించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. దాయాది దేశాలు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.

"పాక్ తన బందీగా ఉన్న భారత పైలట్ అభినందన్​​ను విడుదల చేయడాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ స్వాగతించారు. ఇరుదేశాలు సామరస్యపూర్వక పరిస్థితిని కొనసాగించాలని అభిలషించారు. భారత్​-పాక్​ తమ సమస్యల పరిష్కారానికి చర్చలు చేపట్టాలని సూచించారు."
-స్టీఫెన్ డ్యూజరిక్, ఐరాస కార్యదర్శి అధికార ప్రతినిధి

భారత్​ చేరిన వీర సింహం...

పాక్​ చేతిలో బందీగా ఉన్న భారత పైలట్,​ వింగ్​ కమాండర్​ అభినందన్​ శుక్రవారం వాఘా సరిహద్దు గుండా భారత్​కు చేరుకున్నారు. ఉద్వేగపూరిత వాతావరణంలో భారత సైనిక వీరుడికి ప్రజలు ఘనస్వాగతం పలికారు.

భిన్న స్వరాలు..

ఇరుదేశాల మధ్య శాంతికాముక చర్యగా భారత పైలట్​ అభినందన్​ను విడుదల చేస్తున్నామని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ పాకిస్థాన్ సంయుక్త పార్లమెంటు సమావేశంలో ప్రకటించారు. అయితే భారత్​ మాత్రం, పాక్​ జెనీవా ఒప్పందం ప్రకారమే భారత పైలట్​ను విడుదల చేసిందని వ్యాఖ్యానించింది.

ఇదీ జరిగింది..

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో పాక్ ఆధారిత జైషే మహమ్మద్ చేసిన​ ఉగ్రదాడిలో భారత్ సీఆర్​పీఎఫ్​ జవానులు 40 మంది మరణించారు. ప్రతీకారంగా పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని జైష్​ ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడి చేసింది. ఇందుకు ప్రతిగా పాక్​, భారత భూభాగంపై దాడి చేసింది. దీటుగా స్పందించిన భారత వైమానిక దళం పాక్​ దాడిని తిప్పికొట్టింది.

undefined

ఈ సమయంలో భారత పైలెట్​ అభినందన్ తన మిగ్ యుద్ధవిమానంతో పాక్​ ఎఫ్​-16 యుద్ధ విమానాన్ని కూల్చేశారు. తన విమానం కూలిపోవడం వల్ల పారాషూట్​​తో పాక్​ భూభాగంలో దిగారు. అక్కడ ఉన్న స్థానికులు అభినందన్​ చుట్టిముట్టి భౌతికదాడికి పాల్పడ్డారు. తరువాత పాక్​ సైనికదళం అతనిని తమ అదుపులోకి తీసుకుంది. భారత్​, ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గిన పాక్​ అభినందన్​ను విడుదల చేసింది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.