ETV Bharat / international

ఆసియన్లపై దాడులు ఆపండి: ఐరాస​ - halt to violence and abuse against Asians

ఆసియన్లపై జరుగుతున్న దాడులను ఆపాలని ఐరాస సెక్రటరీ జనరల్​ ఆంటోనియా గుటెరస్​ పిలుపునిచ్చారు. కరోనా కాలంలో ఆసియన్లు లక్ష్యంగా దాడులు జరగడంపై గుటెరస్​ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

UN chief calls for halt to violence and abuse against Asians
ఆసియన్లపై దాడులు ఆపండి: ఐరాస​
author img

By

Published : Mar 23, 2021, 8:40 AM IST

ఆసియన్లు, ఆసియా సంతతికి చెందినవారిపై జరుగుతున్న అన్ని రకాల హింసాత్మక దాడులను ఆపాలని పిలుపునిచ్చారు ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్​ ఆంటోనియా గుటెరస్​. కరోనా కాలంలో ఆసియన్లే లక్ష్యంగా దాడులు జరగడంపై గుటెరస్​ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు ఐరాస ప్రతినిధి ఫర్హాన్​ హక్​ పేర్కొన్నారు.

"ప్రపంచం భయకరమైన ఘోరాలను చూసింది. పని ప్రదేశాల్లో వివక్ష చూపడం, పాఠశాలల్లో బెదిరింపులకు పాల్పడటం, మాటలు ద్వారా, భౌతికంగా వేధింపులు, మీడియా, సామాజిక మాధ్యమాల్లో ద్వేషాన్ని ప్రేరేపించడం లాంటి ఎన్నోఘోరాలు చూసింది. కొన్ని దేశాల్లో ప్రత్యేకంగా ఆసియన్​ మహిళలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇటువంటి హింసలన్ని మానుకోవాలని కోరుతున్నాం."

- ఫర్హాన్ హక్, ఐరాస ప్రతినిధి​

అట్లాంటా మసాజ్​ పార్లర్​పై ఓ దుండగుడు చేసిన దాడిలో ఎనిమిది మంది చనిపోగా.. వారిలో ఆరుగురు ఆసియాకి చెందినవారేనని పేర్కొన్నారు హక్​. ఈ ఘటనలో నిందితుడు లైంగిక వ్యసనంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఆసియన్​ మహిళలను వస్తువులుగా చూడటం సిగ్గుచేటు అని అన్నారు. చైనా వుహాన్​లో కరోనా వెలుగుచూసిన తర్వాత ఆసియా పురుషులపై కూడా దాడులు పెరిగాయన్నారు.

"బాధితులు, వారి కుటుంబాలకు ఐరాస మద్దతుగా నిలుస్తుంది. మానవ హక్కులపై జాత్యహంకారం సహా ఇతర దాడులను ఎదుర్కొంటున్న వారందరికీ సెక్రటరీ జనరల్​ సంఘీభావం తెలిపారు" అని హక్ చెప్పారు.

ఇదీ చూడండి: కొలరాడోలో కాల్పులు- పోలీసు సహా 10 మంది మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.