ETV Bharat / international

'స్వచ్ఛ ఇంధనంపై జీ-20 దృష్టి సారించాలి' - ఇంధన వినియోగం

కరోనా మహమ్మారి సమస్య అంతమవుతున్న వేళ స్వచ్ఛమైన ఇంధనంపై జీ-20 దేశాలు దృష్టి సారించాలని ఐరాస సారథి ఆంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. స్వచ్ఛమైన, సుస్థిర ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.

UN chief
ఆంటోనియో గుటెర్రస్
author img

By

Published : Aug 28, 2020, 4:02 PM IST

భారత్​ సహా జీ-20 దేశాలు స్వచ్ఛమైన, సుస్థిర ఇంధనంలో పెట్టుబడులు పెట్టాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్​ పిలుపునిచ్చారు.

ద ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇనిస్టిట్యూట్​(టీఈఆర్​ఐ) నిర్వహించిన దర్బారి సేఠ్ 19వ స్మారక వేడుకల్లో గుటెర్రస్​ దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛమైన ఇంధనం, వినియోగ అంతరాన్ని తగ్గించటం ముఖ్యమని పేర్కొన్నారు.

"భారత్​లో ఇప్పటికీ శిలాజ ఇంధనాలపై ఇచ్చే రాయితీలు స్వచ్ఛమైన ఇంధనాలకన్నా ఏడు రెట్లు అధికం. 2019-20లో బొగ్గుపై రాయితీలు 206 కోట్ల డాలర్లు దాటాయి. మొత్తంగా శిలాజ ఇంధనాలపై 1,100 కోట్ల డాలర్ల రాయితీలు ఇచ్చారు. అయితే కరోనా సమయంలోనూ భారత్​లో మొత్తం వినియోగంలో పునరుత్పాదక శక్తి నిష్పత్తిని 17 శాతం నుంచి 24 శాతానికి పెంచటం అభినందనీయం."

- ఆంటోనియో గుటెర్రస్​, ఐరాస చీఫ్

గుటెర్రస్​ ప్రసంగంలోని మరికొన్ని కీలకాంశాలు:

  • బొగ్గు వినియోగం 76 శాతం నుంచి 66 శాతానికి పడిపోయింది.
  • పునరుత్పాదక ఇంధనంలో పెట్టుబడుల ద్వారా శిలాజ ఇంధన పరిశ్రమలకు మించి 3 రెట్లు ఉద్యోగ సృష్టి జరుగుతుంది.
  • వాతావారణం మార్పులు, కాలుష్యం వంటి సమస్యలు పరిష్కారమవుతాయి.

ఇదీ చూడండి: ఉగ్రవాదం ఒక క్యాన్సర్: విదేశాంగ మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.