ETV Bharat / international

రెండేళ్ల తర్వాత.. 8వేల కి.మీ ఆవల దొరికిన సర్ఫింగ్‌ బోర్డు - సర్ఫింగ్​ బోర్డు

ఏదైనా ఒక వస్తువు పోయి దాదాపు రెండేళ్ల తర్వాత ఎవరి ద్వారానో మళ్లీ మీ చేతికి వస్తే ఆ కిక్కే వేరు. అలాంటి అనుభూతినే సొంతం చేసుకున్నాడు హవాయి ద్వీపానికి చెందిన ఓ వ్యక్తి. సర్ఫింగ్​ చేసే తన బోర్డు సముద్ర అలల ధాటికి కొట్టుకుపోయి.. రెండేళ్ల తర్వాత 8,700 కిలోమీటర్ల అవతల దొరికింది. అతను ఎవరు? ఆ స్టోరీ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.

Surfing board
సర్ఫింగ్‌ బోర్డు
author img

By

Published : Sep 27, 2020, 9:10 PM IST

హవాయి ద్వీపానికి చెందిన ఓ వ్యక్తికి సముద్ర అలల మీద సర్ఫింగ్ చేయడమంటే సరదా. అనుకోకుండా ఒకరోజు అలల ధాటికి తన సర్ఫింగ్​ బోర్డు కొట్టుకుపోయింది. అయితే రెండేళ్ల తర్వాత దాదాపు 8,700 కి.మీ అవతల అది దొరకడం వల్ల అతడి ఆనందానికి అవధుల్లేవు. ఇంతకి ఎవరు అతను.. ఎక్కడ జరిగింది.. ఏంటా వివరాలు తెలుసుకుందామా..!

డౌగ్‌ ఫాల్టర్‌.. హవాయిలో ఉండే ఓ ఛాయాగ్రాహకుడు. అతడికి సర్ఫింగ్‌ చేయడంలోనూ నైపుణ్యం ఉంది. 2018లో వైమియా తీరంలో సర్ఫింగ్‌ చేస్తుండగా.. భారీ అలల దెబ్బకు సర్ఫింగ్‌ బోర్డు కొట్టుకుపోయినట్లు తన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా చెప్పాడు.

" వైమియా తీరంలో సర్ఫింగ్‌ చేస్తుండగా అలల ధాటికి కొట్టుకుపోయిన బోర్డు మత్స్యకారులకైనా దొరుకుతుందేమోనని ఆశ పడ్డా. అయితే మత్స్యకారులు కూడా తాము చూడలేదని చెప్పడం వల్ల నిరాశ చెందా. ఎన్నో పెద్ద పెద్ద అలలను లెక్క చేయకుండా ఆ బోర్డుమీద సర్ఫింగ్ చేశా. అలల వల్ల కొట్టుకుపోయిన బోర్డులన్నీ తీరంలో తేలుతుంటాయని మత్స్యకారులు చెబుతుంటారు. ఆ ఆశలు కూడా కల్లలే అయ్యాయి. అయితే గత కొద్ది రోజుల కిందట ఫేస్‌బుక్‌ ద్వారా ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద నా సర్ఫింగ్‌ బోర్డు ఉందని. నిజం చెప్పాలంటే హవాయి నుంచి దాదాపు 8,700 కి.మీ దూరంలో ఆ దేశం ఉంది. అయితే ఫిలిప్పీన్స్​కు చెందిన ఆ వ్యక్తి తన విద్యార్థులకు సర్ఫింగ్‌ ఎలా చేయాలని నేర్పించడానికి ఓ మత్స్యకారుడి నుంచి ఆ బోర్డు కొనుగోలు చేశాడంట. ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. నా బోర్డుతో విద్యార్థులు సర్ఫింగ్‌ నేర్చుకోవడం కంటే మంచి ముగింపు ఏముంటుంది."

- డౌగ్​ ఫాల్టర్​, ఛాయాగ్రాహకుడు.

ప్రస్తుతం విదేశీ ప్రయాణానికి సంబంధించి నిబంధనలు ఉండటం వల్ల అక్కడకు వెళ్లలేకపోతున్నానని.. అయితే సర్ఫింగ్‌ నేర్చుకునే వారికి అండగా ఉండేందుకు ఫండ్‌ రైజింగ్‌ చేస్తానని, మరిన్ని బోర్డులతో విమానంలో అక్కడకు వెళ్తానని తెలిపాడు డౌగ్​ ఫాల్టర్​. ఆయనకు ఉన్న 144 మంది విద్యార్థుల్లో కొంతమందికైనా సర్ఫింగ్‌ చేయడం నేర్పుతానని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అలాగే మంచి కార్యం కోసం విరాళాలు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశాడు.

ఇదీ చూడండి: అమెరికన్లు ఇక వారితో లావాదేవీలు జరపలేరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.