కొవిడ్-19 వాక్సినేషన్‌కు సంబంధించి తమ సైట్లో ఉన్న తప్పుడు సమాచారాన్ని తొలగిస్తామని ట్విటర్ ప్రకటించింది. వైరస్, వ్యాక్సిన్ల గురించి ఇప్పటికే ఉన్న అసత్య ట్వీట్లను ఓ జాబితాగా చేశామని తెలిపింది.
వచ్చే వారంలో కొత్తగా తీసుకురానున్న విధానాల గురించి ట్విట్టర్ తన బ్లాగ్‌లో పోస్ట్ చేసింది. ఈ విధానాలకు విరుద్ధంగా ఖాతాదారులు ట్వీట్ చేస్తే వాటిని తొలగించి, వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆ దేశం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. ఈ కొత్త నిబంధనలను తీసుకొస్తున్ననట్లు తెలిపింది ట్విట్టర్.
"టీకాకు సంబంధించి వదంతులు, వివాదాస్పద సందేశాలు, అసంపూర్ణ వార్తలకు మా మాధ్యమంలో చోటు ఉండదు" అని ఆ సంస్థ స్పష్టం చేసింది.
కరోనా టీకా సమర్ధత గురించి తమ సైటుల్లో తప్పుడు సమాచారాన్ని తొలగిస్తామని ఫేస్బుక్, యూట్యూబ్ కూడా ప్రకటించాయి.
ఇదీ చూడండి: ఇక ఇంటివద్దే కొవిడ్ టెస్ట్- 20 నిమిషాల్లోనే ఫలితం!