కరోనా మృత్యుఘోషకు మూడు రోజులపాటు సంతాపం పాటించాలని పిలుపునిచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయ భవనాలపై అమెరికా జాతీయ జెండాను అవనతం (జెండా కర్రకు సగం ఎత్తులో ఎగరెయ్యడం) చేయాలని ఆదేశించారు.
అమెరికాలో ఇప్పటివరకు 96 వేల మందికి పైగా కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో దేశంలో నెలకొన్న విషాదకర పరిస్థితికి సూచికగా జెండాను అవనతం చేయడానికి అధ్యక్షుడు ఆదేశించాలంటూ.. శ్వేత సౌధం స్పీకర్ నాన్సీ పెలోసీ, సెనేట్ మైనారిటీ లీడర్ చక్ స్కుమర్లు ట్రంప్‌నకు లేఖ రాశారు.
"నేను మూడురోజుల పాటు అన్ని జాతీయ సమాఖ్య భవనాలపై జాతీయ జెండాను అవనతం చేయాలని ఆదేశించాను. కరోనా బారిన పడి ప్రాణాలు విడిచిన అమెరికన్లు, మిలిటరీ జవాన్ల స్మారకార్థం నేను ఈ నిర్ణయం తీసుకున్నా."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు