ETV Bharat / international

అమెరికా కలలకు దెబ్బ- హెచ్​1బీ రద్దుకు డిమాండ్లు! - immigration process of america

అమెరికా వీసాల జారీని నిలిపేయాలన్న చట్టసభ సభ్యుల డిమాండ్లు అక్కడికి వెళ్లాలనుకునే ఔత్సాహికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్థానికులకు ఉద్యోగాల కల్పన కోసం హెచ్​1బీ వీసాలను తాత్కాలికంగా రద్దు చేయాలని పలువురు చట్టసభ సభ్యులు పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీసాల అంశమై గందరగోళం నెలకొంది.

america visa
అమెరికా కలలకు దెబ్బ.. హెచ్​1బీ వీసా రద్దుకు డిమాండ్లు!
author img

By

Published : Apr 25, 2020, 1:31 PM IST

అమెరికాలో వీసాల జారీపై చట్టసభల సభ్యులు భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. కరోనా కారణంగా రెండు కోట్ల అరవై లక్షలమంది అమెరికన్లు నిరుద్యోగులుగా మారారని.. వీరికి ఉద్యోగాలు కల్పించేందుకు వీసాల జారీ ప్రక్రియను నిలిపేయాలని పలువురు కోరుతున్నారు. అయితే దేశానికి అవసరమైన వైద్యసిబ్బందిని రప్పించేందుకు వీసాల జారీ కొనసాగాల్సిందేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రీన్​కార్డుల జారీని 60 రోజులపాటు నిలిపేసిన అధ్యక్షుడు ట్రంప్ విదేశీయుల రాకపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

'వారిని నిలువరించాలి..'

హెచ్​1బీ సహా విదేశీ ఉద్యోగుల నియామకాలను తాత్కాలికంగా రద్దు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు విన్నవించారు అమెరికా చట్టసభ సభ్యుడు పాల్ గోసర్. హెచ్​1బీ, హెచ్​4, ఎల్​1, బీ1, బీ2 వీసాలు.. విదేశీయులకు ప్రాక్టికల్ శిక్షణ, గెస్ట్ సిబ్బంది నియామకాలను నిలిపేయాలని కోరారు.

"కరోనా కారణంగా ఇప్పటివరకు రెండుకోట్ల అరవై లక్షల మంది అమెరికన్లు నిరుద్యోగులుగా మారారు. ఇక చేపట్టాల్సింది ఏమైనా ఉందంటే అది విదేశీ ఉద్యోగులను నిలువరించడమే."

-పాల్ గోసర్, అమెరికా చట్టసభ సభ్యుడు

అధ్యక్షుడు ప్రకటించిన గ్రీన్​ కార్డుల జారీ నిలిపివేత.. అమెరికా ఫస్ట్ నినాదం దిశగా సరైనదేనని అభిప్రాయపడ్డారు గోసర్. అయితే విదేశాంగ, రక్షణ, హోం శాఖ మంత్రులు.. విదేశీ ఉద్యోగుల రాకను నిలిపేయాలని సిఫార్సు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అమెరికా ఫస్ట్ నినాదాన్ని అమలు చేయడానికి ఇంతకంటే సరైన సమయం ఉండదన్నారు గోసర్.

వైద్య నిపుణుల కోసం

అయితే హెచ్​1బీ వీసాలు ఉన్న వైద్య నిపుణులకు రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని మరో చట్టసభ సభ్యుడు జోష్ హార్డర్ కాంగ్రెస్ సెలెక్ట్ కమిటీకి లేఖ రాశారు. కరోనాపై పోరులో వీరు ముందంజలో ఉండి పోరాడాల్సి ఉన్నందున ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు.

'గ్రీన్ కార్డ్​పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి'

కొత్తగా గ్రీన్​కార్డులు జారీ చేయకూడదని అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు అమెరికా సెనేటర్ మైఖేల్ బెన్నెట్. వైద్య నిపుణులకు హెచ్​1బీ వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

"అమెరికాకు ఆరోగ్య సిబ్బంది అవసరమైన వేళ గ్రీన్​కార్డుల జారీపై అధ్యక్షుడి నిర్ణయం దేశ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధమైంది. విదేశీ ఆరోగ్య నిపుణుల దరఖాస్తుల పరిశీలనను వీసా సేవల విభాగం, విదేశాంగ శాఖ వేగవంతం చేసి.. దేశంలోకి వచ్చేందుకు త్వరితగతిన అనుమతించాలి."

-మైఖేల్ బెన్నెట్, సెనేటర్

ట్రంప్ సర్కారు వలసదారులకు వ్యతిరేకమైన నిర్ణయం తీసుకోవడం సరికాదని పేర్కొంటూ మరో లేఖ రాశారు బెన్నెట్. 25 శాతం వైద్యులు, 17 శాతం వైద్య సిబ్బంది విదేశీయులేనని పేర్కొన్నారు. వలసదారులకు వ్యతిరేకమైన విధానాలను పాటిస్తున్న ప్రభుత్వం అనేకమందిని ప్రమాదంలోకి నెట్టిందని లేఖలో విమర్శించారు.

ఇదీ చూడండి: కరోనా కయ్యం: చైనాపై అమెరికా ముప్పేట దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.