ETV Bharat / international

'చైనా యాప్​ల బ్యాన్​పై త్వరలోనే నిర్ణయం' - అమెరికన్ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు

టిక్​టాక్​ సహా చైనాకు చెందిన మొబైల్ యాప్​లను నిషేధించాలని 24 మంది రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుల బృందం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు విజ్ఞప్తి చేసింది. జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉండడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన శ్వేతసౌధం వర్గాలు.. వారాల వ్యవధిలోనే ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.

Trump urged to ban TikTok, other Chinese apps
చైనా యాప్​ల నిషేధంపై త్వరలో నిర్ణయం: శ్వేతసౌధం
author img

By

Published : Jul 16, 2020, 11:51 AM IST

అమెరికాలో టిక్​టాక్​ సహా చైనాకు చెందిన మొబైల్ యాప్​లను నిషేధించాలని... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను 24 మంది రిపబ్లికన్ చట్టసభ్యులు కోరారు. చైనాకు చెందిన 59 యాప్​లను... జాతీయ భద్రతా సమస్యల కారణంగా భారత్​ నిషేధించిన విషయాన్ని వారు అధ్యక్షునికి గుర్తుచేశారు.

చైనాకు చెందిన యాప్​లు అమెరికన్ వినియోగదారుల డేటాను సేకరిస్తున్నాయి. టిక్​టాక్ మాతృ సంస్థ బైట్​డాన్స్ సహా మిగతా చైనా కంపెనీలు... చైనా సైబర్ సెక్యూరిటీ చట్టాల మేరకు ఈ సమాచారాన్ని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)తో పంచుకుంటున్నాయి. దీని వల్ల అమెరికా జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉంది."

- రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుల లేఖ సారాంశం

చైనా యాప్​ల వల్ల అమెరికన్ ప్రజల గోప్యత, భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ సభ్యులు.. ట్రంప్​కు విజ్ఞప్తి చేశారు.

డేటా మైనింగ్​

వాస్తవానికి చైనా అధికారులు అధునాతన డేటా మైనింగ్ విధానాల ద్వారా అమెరికన్ వినియోగదారుల డేటానే కాకుండా, యూఎస్ ప్రభుత్వ డేటాను కూడా సాపేక్షికంగా నియంత్రించగలుగుతున్నారని రిపబ్లికన్ సభ్యులు అభిప్రాయపడ్డారు.

వినియోగదారుల ఐపీ అడ్రస్​, జియో లొకేషన్, బ్రౌజింగ్ హిస్టరీ సహా సున్నితమైన సమాచారాన్ని... అధునాతన ఐడెంటిఫయర్లు, కుకీలు ఉపయోగించి చైనా యాప్​లు సేకరిస్తున్నాయని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు.

త్వరలోనే నిషేధం?

టిక్​టాక్​ సహా చైనా యాప్​లపై నిషేధం విధించాలా? లేదా? అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. వారాల వ్యవధిలోనే ఈ పని పూర్తవుతుందని.. ఇందుకు నెలల సమయం తీసుకోమని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: హెచ్-​1బీ వీసాల నిలిపివేతపై భారతీయుల సవాల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.