అమెరికా అధ్యక్ష పదవి వీడాక.. తొలిసారి ఓ సమావేశంలో పాల్గొననున్నారు డొనాల్డ్ ట్రంప్. ఆయన ఫ్లొరిడాలో ఈ నెల 28న జరిగే ఓ సంప్రదాయవాద సమావేశానికి హాజరుకానున్నారని అమెరికన్ కన్సర్వేటివ్ యూనియన్ ప్రతినిధి ఇయాన్ వాల్టర్స్ తెలిపారు. ఇదే జరిగితే శ్వేతసౌధం ఆవల.. ట్రంప్ తొలిసారి మాట్లాడినట్లవుతుంది.
తన రాజకీయ వృద్ధిలో కీలకపాత్ర పోషించిన 'కన్సర్వేటివ్ పొలిటికల్ ఆక్షన్ కాన్ఫరెన్స్(సీపీఏసీ)'తో సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్న ట్రంప్.. దాని వార్షిక సమావేశానికి హాజరుకానున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో ఆయన రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తు గురించి ప్రసంగిస్తారని అందరూ భావిస్తున్నారు. అంతేకాకుండా.. తన ఇమ్మిగ్రేషన్ విధానాలను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రద్దు చేయడంపై కూడా ట్రంప్ విమర్శనాస్త్రాలు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో విదేశాంగ మాజీ మంత్రి మైక్ పాంపియో సహా.. ఫ్లొరిడా, సౌత్ డకోటా పాలనాధికారులు పాల్గొననున్నారు.
ఇదీ చదవండి: '2024లో పోటీ గురించి ఇప్పుడే ఏం చెప్పలేను'