ETV Bharat / international

'చైనాతో వాణిజ్య ఒప్పందం ఇప్పట్లో లేనట్టే' - చైనా అమెరికా వాణిజ్య యుధ్దం

అమెరికా-చైనా రెండో దశ వాణిజ్య ఒప్పందానికి తక్కువ ప్రాధాన్యం.. ఇస్తున్నట్లు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.

Trump swipes at China for virus, trade deal
రెండోదశ వాణిజ్య ఒప్పందాలు అప్పుడే కాదు: ట్రంప్​
author img

By

Published : Jul 11, 2020, 9:29 AM IST

Updated : Jul 11, 2020, 10:22 AM IST

అమెరికా-చైనా రెండో దశ వాణిజ్య ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. వాణిజ్య ఒప్పందానికి తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు​ తెలిపారు. కరోనా​ వ్యాప్తి సమాచారాన్ని చైనా దాచి పెట్టిందని.. అందువల్లే ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ట్రంప్​ పేర్కొన్నారు.

అయితే రెండోదశ ఒప్పందంలో చైనాతో పనిచేయడాన్ని పూర్తిగా తోసిపుచ్చలేదు ట్రంప్​. ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. కానీ.. వుహాన్​ నుంచి పుట్టుకొచ్చిన వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చైనా మరిన్ని కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిందని ట్రంప్ తెలిపారు​.

వాణిజ్య యుద్ధానికి ముగింపు పలుకుతూ ఈ ఏడాది జనవరిలో అమెరికా-చైనా తొలి దశ ఒప్పందంపై సంతకం చేశాయి. అయితే రెండోదశ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఎన్నికలు ముగిసే వరకు వేచి చూడాలని ఇంతకుముందే ట్రంప్​ వెల్లడించారు.

ఇదీ చూడండి: సింగపూర్​ ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం

Last Updated : Jul 11, 2020, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.