ETV Bharat / international

'ప్యాకేజీ నాకు నచ్చలేదు.. మళ్లీ పంపండి'

అమెరికా కాంగ్రెస్​ అంగీకరించిన భారీ ఉద్దీపన ప్యాకేజీపై సంతకం చేయకపోవచ్చని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్యాకేజీలో ఎక్కువ భాగం నిధులను విదేశాలకే కేటాయించారని ఆరోపించారు. బిల్లును సరిచేసి తన వద్దకు తిరిగి పంపాలని చట్టసభ్యులకు సూచించారు.

Trump suggests he might not sign COVID relief bill
కరోనా ప్యాకేజీపై సంతకం చేయను: ట్రంప్
author img

By

Published : Dec 23, 2020, 8:40 AM IST

అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన 900 బిలియన్ డాలర్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్యాకేజీలో కరోనా సంబంధిత అంశాలేవీ లేవని.. ఇందులో ఎక్కువ భాగం నిధులన్నీ విదేశాలకే కేటాయించారని ఆక్షేపించారు. ఆ నిధులన్నీ చివరగా రష్యా ఆయుధ కొనుగోళ్లకే వెళ్తాయని ఆరోపించారు. తాను ఈ ప్యాకేజీని ఆమోదించడంపై అనుమానం వ్యక్తం చేశారు. సంతకం చేయకపోవచ్చంటూ ట్విట్టర్​లో విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొన్నారు.

అమెరికాలోని ప్రజలకు 600 డాలర్లు ఇచ్చే విధంగా ప్యాకేజీని రూపొందించింది కాంగ్రెస్. అయితే దీన్ని సవరించాలని ట్రంప్ సూచించారు. 600 డాలర్ల నుంచి 2 వేల డాలర్లకు లేదా ఒక్కో జంటకు 4 వేల డాలర్ల చొప్పున ఇచ్చేలా ప్యాకేజీ సిద్ధం చేయాలని పేర్కొన్నారు. బిల్లులో వ్యర్థాలు, పనికిరాని అంశాలను తొలగించాలని స్పష్టం చేశారు. వీటిని సరిచేసి తగిన బిల్లును తనవద్దకు పంపించాలని కోరారు.

ఇదీ చదవండి: '900 బిలియన్​ డాలర్ల ప్యాకేజీ ఆమోదించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.