ETV Bharat / international

చైనాకు చెక్ పెట్టే కీలక బిల్లుపై ట్రంప్​ సంతకం

author img

By

Published : Dec 28, 2020, 7:37 PM IST

చైనా ప్రమేయం లేకుండా టిబెట్‌ తమ దలైలామా వారసుడిని ఎన్నుకునే వీలు కల్పించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. తాజా బిల్లుతో టిబెట్‌లో అమెరికా రాయబార కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. దీనికి చైనా అడ్డుతగిలే ఆస్కారం ఉన్న కారణంగా చైనాపై అమెరికా ఆంక్షలు విధించింది.

Trump signs Tibet policy to preempt Chinese move on Dalai Lama's succession
టిబెట్​లో చైనాకు చెక్ పెట్టే కీలక బిల్లుపై ట్రంప్​ సంతకం..

పదవీకాలం ముగుస్తోన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాకు చెక్‌ పెట్టే చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు. చైనా ప్రమేయం లేకుండా టిబెట్‌ తమ దలైలామా వారసుడిని ఎన్నుకునే వీలు కల్పించే బిల్లును అమెరికా చట్టసభ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బిల్లుపై డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. తాజా బిల్లుతో టిబెట్‌లో అమెరికా రాయబార కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. దీనికి చైనా అడ్డుతగిలే ఆస్కారం ఉన్న కారణంగా చైనాపై ఆంక్షలు విధించింది. టిబెట్‌లో అమెరికా కాన్సులేట్‌ ఏర్పాటయ్యే వరకూ అమెరికాలో కొత్తగా చైనా కాన్సులేట్‌ ఏర్పాటు చేసే వీలు లేకుండా చూసే అధికారాన్ని ఈ చట్టం అమెరికా అధికారులకు కల్పించింది.

టిబెట్‌లో దలైలామా వారసుడిని ఎన్నుకోవడంతో పాటు ఇతర కార్యక్రమాల్లో టిబెటెన్లకే హక్కు ఉండే విధంగా ‘ది టిబెటన్‌ పాలసీ, సపోర్టు యాక్ట్‌-2020’ రూపొందించారు. ముఖ్యంగా తదుపరి దలైలామాను ఎన్నుకునే అధికారం ఆ వర్గానికే ఉండడంతో పాటు టిబెట్‌లోని లాసాలో అమెరికా కాన్సులేట్‌ ఏర్పాటు చేసే విధంగా దీన్ని రూపొందించారు. కేవలం టిబెట్‌లోని బౌద్ధులు మాత్రమే కొత్త దలైలామాను ఎంపిక చేసేలా చూడటానికి వీలుగా అంతర్జాతీయ మిత్రపక్షాలను కూడగట్టుకునే వీలుంటుంది. ఈ ఎంపిక విషయంలో చైనా జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. దానిపై నిర్ణయాలన్నీ ప్రస్తుత దలైలామా, టిబెట్‌ వాసులే తీసుకోవాలని అందులో పేర్కొంది. నీటి భద్రతపై ప్రాంతీయ కార్యాచరణను ప్రోత్సహించేలా అమెరికా విదేశాంగ శాఖ చర్యలు తీసుకునేలా ఈ చట్టం సూచిస్తోంది. నదీ జలాలపై హక్కులున్న దేశాల మధ్య సహకార ఒప్పందాలు చేసుకునే వీలుంటుంది.

అయితే, టిబెట్‌ అంశంపై అమెరికా చర్యలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చకూడదని..దీనిపై ట్రంప్ సంతకం చేయకూడదని ఈ మధ్యే హెచ్చరించింది. చైనా ఒత్తిడి చేసినప్పటికీ ఈ బిల్లుపై డొనాల్డ్‌ ట్రంప్‌ ముందుకే వెళ్లారు.

ఇదిలాఉంటే, ప్రస్తుతం ఉన్న 14వ దలైలామాను చైనా వేర్పాటువాదిగానే చూస్తోంది. చైనా నుంచి టిబెట్‌ను వేరు చేసేందుకు ప్రస్తుత దలైలామా ప్రయత్నిస్తున్నట్లు భావిస్తోంది.

ఇదీ చదవండి:లక్షల మంది నిరుద్యోగులకు 'ట్రంప్ దెబ్బ'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.