ETV Bharat / international

చైనాకు ట్రంప్​ షాక్- 'హాంకాంగ్​' చట్టంపై సంతకం - Hong Kong Autonomy Act

హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛను హరించిన చైనాను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక చర్యలు చేపట్టారు. 'హాంకాంగ్ స్వయం ప్రతిపత్తి చట్టం'పై సంతకం చేశారు. అలాగే హాంకాంగ్​కు ఇస్తున్న ప్రత్యేక (ఆర్థిక) హోదా కూడా రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.

Trump signs into law Hong Kong Autonomy Act, suspends special privileges
హాంకాంగ్ 'స్వయంప్రతిపత్తి చట్టం'పై ట్రంప్ సంతకం
author img

By

Published : Jul 15, 2020, 7:43 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'హాంకాంగ్​ స్వయంప్రతిపత్తి చట్టం'పై మంగళవారం సంతకం చేశారు. అలాగే హాంకాంగ్​కు ఇస్తున్న ప్రత్యేక (ఆర్థిక) హోదాను కూడా రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుకు ఆమోదం తెలిపారు.

"హాంకాంగ్​ ప్రజలపై చైనా అణచివేత చర్యలకు పాల్పడుతోంది. దీనిపై చైనా జవాబుదారీగా ఉండేందుకు గాను .. ఈ రోజు నేను ఓ చట్టంపై, ఓ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశాను."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఏకగ్రీవ ఆమోదం

హాంకాంగ్ స్వయంప్రతిపత్తి చట్టాన్ని కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఆమోదించిందని ట్రంప్ పేర్కొన్నారు. దీనితో హాంకాంగ్ స్వేచ్ఛను హరించిన శక్తులపై చర్య తీసుకోవడానికి.. ప్రభుత్వానికి శక్తిమంతమైన కొత్త సాధనం సమకూరిందని ఆయన అన్నారు.

"హాంకాంగ్​ ప్రజల స్వేచ్ఛను హరించారు. వారి హక్కులను కాలరాశారు. ఇది మంచిది కాదు. దీని వల్ల ఇకపై హాంకాంగ్​ స్వేచ్ఛా మార్కెట్లతో పోటీ పడలేదు. నా అభిప్రాయం ప్రకారం, చాలా మంది ప్రజలు అక్కడి నుంచి బయటకి వెళ్లిపోతారు. ఫలితంగా మనం (అమెరికా) మరింతగా వ్యాపార అభివృద్ధి సాధిస్తాం. ఎందుకంటే హాంకాంగ్ లాంటి మంచి పోటీదారుని కోల్పోయాం."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ప్రత్యేక ప్రతిపత్తి రద్దు

అమెరికా... హాంకాంగ్​కు ఇస్తున్న ప్రత్యేక ప్రతిపత్తిని కూడా రద్దు చేస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.

"హాంకాంగ్ ఇప్పుడు చైనా ప్రధాన భూభాగంగా మారిపోయింది. దానికి ప్రత్యేక హక్కులు లేవు. ప్రత్యేక ఆర్థిక ప్రతిపత్తి లేదు. సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం దానికి చేరడం లేదు. అందరికీ తెలుసు... చైనా ఉత్పత్తులపై ఇప్పటికే అమెరికా భారీ ఎత్తున సుంకాలు విధించింది. ఫలితంగా అమెరికాకు భారీ ఎత్తున ఆదాయం వచ్చింది. దీనిని అమెరికన్ రైతులకు అందించాం. అందువల్ల ఇకపై చైనా ప్రధాన భూభాగమైన హాంకాంగ్​కూ ఈ పన్నుల భారం వర్తిస్తుంది."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఇదీ చూడండి: కొత్త వీసా విధానంపై వెనక్కి తగ్గిన ట్రంప్ సర్కారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.