ETV Bharat / international

'కరోనా' ఆంక్షల ఎత్తివేత దిశగా ట్రంప్ అడుగులు - coronavirus latest news china

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 1 లక్షా 19 వేల మంది మృత్యువాత పడగా... 13 లక్షల 57 వేల మందికి పైగా మహమ్మారితో పోరాడుతున్నారు. 4 లక్షల 48 వేల మంది సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్.. తమ దేశంలో అమలవుతున్న ఆంక్షలను​ ఎత్తివేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Trump says he is 'very close' to completing a plan to reopen US
ఆంక్షలు తొలగించే దిశగా ట్రంప్ ఆలోచనలు!
author img

By

Published : Apr 14, 2020, 11:35 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి సుమారు 1 లక్షా 19 వేల మందికి పైగా మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 19 లక్షల 25 వేలు దాటింది. సుమారు 4 లక్షల 48 వేల మంది కోలుకోవడం కొంత ఊరట.

చైనాలో కొత్త కేసులు

చైనాలో కొత్తగా 89 కరోనా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన చైనా పౌరుల్లో 86 మందికి కొవిడ్​-19 వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. మిగతా 3 కేసులు దేశీయంగా గువాంగ్​డాంగ్ రాష్ట్రంలో నమోదయ్యాయి.

అమెరికా, రష్యా, ఇరాన్​, ఐరోపా దేశాల నుంచి చైనా పౌరులు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఈ కారణంగానే కొవిడ్​-19 కేసులు మళ్లీ పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. కట్టడి చేశామనుకుంటున్న తరుణంలో మళ్లీ కరోనా వైరస్​ విజృంభిస్తుండడంపై అధికారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

ఆంక్షలు ఎత్తివేసే దిశగా ..

కరోనా వైరస్​ వ్యాప్తిని నిరోధించేందుకు విధించిన ఆంక్షలను... ఏప్రిల్​ 30 కంటే ముందే తొలగించే దిశగా ఆలోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పేర్కొన్నారు. శ్వేతసౌధంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విధంగా స్పందించారు.

"నేను నా బృందంతో, నిపుణులతో చర్చలు జరుపుతున్నాను. షెడ్యూల్​ కంటే ముందే దేశంలో అమలుపరుస్తున్న ఆంక్షలను​ తొలగించేందుకు కృషిచేస్తున్నాం. ఇది ఇప్పుడు చాలా ముఖ్యం." - డొనాల్డ్ ​ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించారు. దీనితో అమెరికాలోని 330 మిలియన్ల జనాభాలో 95 శాతం మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ ఆంక్షల అమలు​ వల్ల తమ దేశం ఆర్థికంగా దెబ్బతింటుందని ట్రంప్ భావిస్తున్నారు.

అమెరికాలో సోమవారం 1,334 మంది కరోనాతో మరణించగా, 24,896 కొత్త కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కొవిడ్​-19 మరణాలు, కేసుల కంటే ఈ సంఖ్య చాలా తక్కువ. దీనిని అనుసరించి అమెరికాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

world corona death toll
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం

ఇదీ చూడండి: 'భారత్​కు క్షిపణుల విక్రయానికి అమెరికా రెడీ'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.