ETV Bharat / international

ట్రంప్‌, బైడెన్‌ మధ్య రెండో డిబేట్‌ జరిగేనా? - ట్రంప్ బైడెన్ వర్చువల్ డిబేట్

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య రెండో సంవాదాన్ని వర్చువల్​గా నిర్వహించాలన్న కమిషన్ నిర్ణయాన్ని ట్రంప్ వ్యతిరేకించారు. వర్చువల్​గా నిర్వహిస్తే తాను పాల్గొనబోనని స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని మార్చలేమని కమిషన్‌ తేల్చిచెప్పింది. డిబేట్​పై మరోసారి ఆలోచించేది లేదని పేర్కొంది.

Trump refuses for virtual debate as commission eyes health safety
ట్రంప్‌, బైడెన్‌.. రెండో డిబేట్‌ జరిగేనా?
author img

By

Published : Oct 9, 2020, 1:27 PM IST

అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్‌ ట్రంప్‌, జో బైడెన్‌ల మధ్య రెండో ముఖాముఖిపై సందిగ్ధత నెలకొంది. ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రెండో డిబేట్‌ను వర్చువల్‌ పద్ధతిలో జరపాలన్న కమిషన్‌ ఆన్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్‌ ‌(సీపీడీ) నిర్ణయాన్ని ట్రంప్‌ వ్యతిరేకించారు. వర్చువల్‌గా నిర్వహిస్తే తాను పాల్గొనబోనని చెప్పారు. మరోవైపు సీపీడీ కూడా తన నిర్ణయంపై స్పష్టంగా ఉంది. డిబేట్‌పై మరోసారి ఆలోచించలేమని గట్టిగా చెప్పింది.

షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరు 15న ట్రంప్‌, బైడెన్‌ మధ్య రెండో డిబేట్‌ జరగాల్సి ఉంది. అయితే కొవిడ్‌ బారిన పడిన అధ్యక్షుడు ట్రంప్‌ ప్రస్తుతం శ్వేతసౌధంలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బైడెన్‌తో జరిగే రెండో ముఖాముఖిని వర్చువల్‌ విధానంలో జరపాలని సీపీడీ గురువారం నిర్ణయించింది. కాగా.. దీన్ని ట్రంప్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంపై ఫాక్స్‌ న్యూస్‌తో మాట్లాడిన ఆయన‌.. 'వర్చువల్‌ పద్ధతిలో జరిగే డిబేట్‌లో పాల్గొని నా సమయాన్ని వృథా చేసుకోను. ఇది మాకు అంగీకారం కాదు' అని స్పష్టం చేశారు. బైడెన్‌ను రక్షించేందుకే సీపీడీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. సీపీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు.

బైడెన్​ ఓకే

ట్రంప్‌ వ్యాఖ్యలపై డిబేట్స్‌ కమిషన్‌ స్పందించింది. డిబేట్‌లో పాల్గొనే వారి ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని ముఖాముఖిని వర్చువల్‌గా నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఇప్పుడు తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించే ఆలోచన లేదని.. డిబేట్‌ వర్చువల్‌గానే జరుగుతుందని స్పష్టం చేసింది. మరోవైపు బైడెన్‌ మాత్రం వర్చువల్‌ డిబేట్‌కు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌, బైడెన్‌ల మధ్య రెండో ముఖాముఖి జరుగుతుందా లేదా అనేదానిపై సందిగ్ధత నెలకొంది.

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడే అభ్యర్థులు బహిరంగంగా చర్చించడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల ముందు మూడుసార్లు జరిగే ఈ డిబేట్‌లను సీపీడీ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ట్రంప్‌, బైడెన్‌ల మధ్య తొలి సంవాదం సెప్టెంబరు 29న జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకే ట్రంప్‌ కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో మిగతా రెండు చర్చలను వర్చువల్‌గా నిర్వహించాలని సీపీడీ నిర్ణయించింది.

ఇదీ చదవండి- కరోనాను జయించి జనంలోకి వస్తోన్న ట్రంప్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.