ETV Bharat / international

తొలగిన విభేదాలు- ట్రంప్, పెన్స్ ముచ్చట్లు

author img

By

Published : Jan 12, 2021, 1:43 PM IST

అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షుల మధ్య విభేదాలు సమసిపోయినట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్, మైక్ పెన్స్ మాట్లాడుకున్నారని అధికారులు తెలిపారు. ఓవల్ ఆఫీస్​లో మంచి సంభాషణ జరిగిందని చెప్పారు. దేశ ప్రజల కోసం మిగిలిన కాలం పాటు పనిచేయాలని సంకల్పించుకున్నట్లు వెల్లడించారు.

Trump, Pence speak for first time since attack
ట్రంప్ పెన్స్

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మధ్య మనస్పర్ధలు తొలగిపోయినట్లు కనిపిస్తోంది. వారం రోజుల ఉద్రిక్త పరిస్థితుల తర్వాత తొలిసారి సోమవారం సాయంత్రం ఓవల్ ఆఫీస్​లో కలుసుకున్నారని అధికారులు తెలిపారు. వీరిద్దరి మధ్య మంచి సంభాషణ జరిగిందని చెప్పారు.

గత నాలుగేళ్లలో సాధించిన విజయాలతో పాటు, తదుపరి వారం పాటు చేపట్టే పనులపై ఇరువురు చర్చించారని ఓవల్ ఆఫీస్ అధికారులు తెలిపారు. క్యాపిటల్​ భవనంపై జరిగిన దాడి అమెరికాలో పరిస్థితికి అద్దం పట్టదని ఇరువురు పేర్కొన్నట్లు చెప్పారు. దేశ ప్రజల కోసం మిగిలిన కాలం పాటు పనిచేసేందుకు ప్రతిజ్ఞ చేసినట్లు స్పష్టం చేశారు. తద్వారా.. 25వ అధికరణ ద్వారా ట్రంప్​ను అధికారంలో నుంచి తొలగించాలని చేస్తున్న ప్రయత్నాలకు సహకరించనని పెన్స్ సూచన ప్రాయంగా చెప్పినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

విభేదాలు ఇలా..

కాంగ్రెస్​లో బైడెన్​ ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికను అడ్డుకోవాలని ట్రంప్.. పెన్స్​ను ఆదేశించారు. అందుకు పెన్స్ నిరాకరించారని వార్తలు వచ్చాయి. అనంతరం పెన్స్​ లక్ష్యంగా మాటల దాడికి దిగారు ట్రంప్. దేశ సమగ్రతను కాపాడంలో పెన్స్​ వెనకడుగు వేశారని ఆరోపించారు.

మరోవైపు, ట్రంప్​ను పదవిలో నుంచి తొలగించేందుకు డెమొక్రాట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అధ్యక్షుడికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ట్రంప్​ను గద్దె దించేందుకు ఉపాధ్యక్షుడు 25వ అధికరణ ప్రయోగించాలనే ఈ తీర్మానంపై బుధవారం ఓటింగ్ చేపట్టనున్నారు.

అయితే, డెమొక్రాట్ల ప్రయత్నాలన్నీ పెన్స్ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేందుకేనని ఆయన సన్నిహితుడు ఒకరు ఆరోపించారు.

ఇదీ చదవండి: ట్రంప్​కు ఫేస్​బుక్, ట్విట్టర్ వరుస షాకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.