ETV Bharat / international

ఆ 15 మందికి ట్రంప్ క్షమాభిక్ష ​

అగ్రరాజ్యంలో వివిధ నేరాల్లో దోషులుగా తేలిన 15 మందికి క్షమాభిక్షను ప్రసాదించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. వారిలో మ్యూలర్​ దర్యాప్తు​లో దోషులుగా తేలిన రిపబ్లికన్​ పార్టీ నేతలు కూడా ఉన్నారు.

Trump pardons 15, including Republican allies
ప్రత్యర్థలకూ క్షమాభిక్ష వరాలు ప్రసాదించిన ట్రంప్
author img

By

Published : Dec 23, 2020, 2:31 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. మరో 15 మందికి క్షమాభిక్షలను ప్రసాదించారు. వీరిలో.. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యంపై 'రాబర్ట్​ మ్యూలర్​​​' చేపట్టిన దర్యాప్తులో దోషులుగా తేలిన వారు ఉన్నారు. అదే సమయంలో రిపబ్లికన్ మాజీ చట్టసభ్యులు, 2007 ఇరాక్ విధ్వంసకాండలో దోషులైన మిలిటరీ కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. మరోవైపు క్షమాభిక్షలతో పాటు ఐదుగురికి శిక్షను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్​.

తాజాగా.. ట్రంప్​ క్షమాభిక్ష పొందిన వారిలో రిపబ్లికన్ పార్టీ మాజీ ప్రచార సహాయకుడు జార్జ్​ పాపాడోపౌలోస్​తో పాటు కాంగ్రెస్ మాజీ సభ్యులు డంకన్ హంటర్, క్రిస్ కాలిన్స్ ఉన్నారు. ఇరాక్​ ఊచకోతలో దోషులుగా తేలిన మరో నలుగురు బ్లాక్​వాటర్​ గార్డ్స్​కు ట్రంప్​ క్షమాభిక్షనిచ్చారు.

మ్యూలర్​ దర్యాప్తు అధికారులతో అబద్ధాలు చెప్పి.. 30రోజుల జైలు శిక్ష ఎదుర్కొన్న డచ్​ న్యాయవాది అలెక్స్​ వాన్​ డర్​ జ్వాన్​కు ట్రంప్ తాజాగా​ క్షమాభిక్ష ప్రసాదించారు. స్వచ్ఛంద సంస్థల పేరిట మనీలాండరింగ్​కు పాల్పడ్డ స్టీవ్​ స్టాక్​మ్యాన్​ అనే రిపబ్లికన్​ తరఫున మాజీ కాంగ్రెస్​ సభ్యుడుకి శిక్షను తగ్గించారు ట్రంప్.

అధ్యక్షుడు ట్రంప్​ తన పదవీకాలం చివరిరోజుల్లో వరుసగా క్షమాభిక్షలు ప్రకటిస్తూ వస్తున్నారు. గత నెలలో.. మ్యూలర్​ దర్యాప్తులో దోషిగా తేలిన మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేల్​ ఫ్లిన్​కు కూడా క్షమాభిక్ష ప్రసాదించారు.

ఇదీ చూడండి:'ట్రంప్​ చేసింది మార్చాలంటే నెలలు గడిచిపోతాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.