తన సలహాదారుడు హోప్ హిక్స్ కరోనా బారినపడినట్లు తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించారు.
హోప్‌కు కొవిడ్ సోకినట్లు తేలగానే.. డొనాల్డ్, ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో.. క్వారంటైన్‌కు వెళ్లనున్నట్లు ట్వీట్ చేశారు డొనాల్డ్.
''కొంచెం కూడా విరామం తీసుకోకుండా కష్టపడే హోప్ హిక్స్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రథమ మహిళ, నేను పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. అనంతరం.. మేం క్వారంటైన్‌కు వెళ్లనున్నాం.''
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అంతకుముందు కూడా శ్వేతసౌధంలోని పలువురు సిబ్బంది కరోనా బారినపడ్డారు. జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియన్, కేటీ మిల్లర్ సహా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సెక్రటరీ ఇందులో ఉన్నారు.