అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌కు ఉన్న మద్దతును తెలియజేసేలా ఆయన ప్రపంచ పటాన్ని ట్వీట్ చేశారు. మన దేశంలో అంతర్భాగమైన జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్ని అందులో వేరుగా చూపించారు.
మ్యాప్ ఇలా...
-
Okay, finally got around to making my electoral map prediction. #2020Election #VOTE pic.twitter.com/STmDSuQTMb
— Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Okay, finally got around to making my electoral map prediction. #2020Election #VOTE pic.twitter.com/STmDSuQTMb
— Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 3, 2020Okay, finally got around to making my electoral map prediction. #2020Election #VOTE pic.twitter.com/STmDSuQTMb
— Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 3, 2020
జూనియర్ ట్రంప్ పోస్ట్ చేసిన మ్యాప్‌లో అత్యధిక దేశాలను ఎరుపు రంగులో చూపించారు. ఎరుపు రంగు రిపబ్లికన్ పార్టీని సూచిస్తుంది. ఇందులో భారత్‌ను నీలి రంగు (బైడెన్ పార్టీ రంగు)లో చూపించారు. అంటే భారత్.. బైడెన్‌కు మద్దతిస్తుందనే ఉద్దేశంతో ఈ మ్యాప్ ఉంది. కానీ భారత్‌లో భాగమైన ఈశాన్య రాష్ట్రాలు సహా జమ్ముకశ్మీర్ ప్రాంతాలను ఇందులో ఎరుపు రంగులో చూపారు. ఇది వివాదాస్పదంగా ఉంది. ఈ పటంలో చైనాను సైతం నీలి రంగులో చూపారు.