తనకు క్రిస్మస్ కానుకగా ఉత్తరకొరియా క్షిపణి పరీక్షను ఇవ్వదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరినాటికి అణు చర్చల్లో పురోగతి లేకుంటే.. క్రిస్మస్ కానుకగా క్షిపణి పరీక్ష నిర్వహిస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బెదిరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటాయన్నారు.
క్రిస్మస్ కానుకగా తనకు ఓ పూలకుండి అందే అవకాశముందని చమత్కరించారు ట్రంప్.
"నన్ను ఆశ్చర్యపరచడానికి అందరి దగ్గర కానుకలున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. దానిని రానివ్వండి నేను చూసుకుంటా. వచ్చేది మంచి కానుకే అని ఆశిస్తున్నా. క్షిపణి పరీక్షకు మేము వ్యతిరేకం కాబట్టి కిమ్ ఓ మంచి పూలకుండి పంపించవచ్చు."
--డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
ఈ ఏడాది ప్రారంభంలో హనోయి వేదికగా ట్రంప్, కిమ్‌ల మధ్య జరిగిన రెండవ శిఖరాగ్ర సమావేశం విఫలమైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య అణ్వాయుధీకరణపై చర్చలు క్లిష్టతరంగా మారాయి.