అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తరవాత ముందస్తుగా విజయం ప్రకటించనున్నారని వస్తున్న వార్తలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టి పారేశారు. అయితే, ఎన్నికల తరువాత న్యాయ పోరాటానికి తాను సిద్ధమవుతున్నానని సూచనలు చేశారు.
బ్యాలెట్ సేకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును విమర్శిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్.
"ఆ వార్తల్లో వచ్చింది తప్పుడు నివేదిక. ఎన్నికల తర్వాత బ్యాలెట్లను ఎప్పుడు సేకరిస్తారనేది కీలక విషయం. ఇందులో తప్పులు జరిగే ప్రమాదం ఉంది. ఈ ఆధునిక కంప్యూటర్ యుగంలోనూ ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలు తెలియకపోవటం వింతే. ఎన్నికలు పూర్తయిన వెంటనే మా న్యాయవాదుల ద్వారా ముందుకెళతాం. "
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
కీలక రాష్ట్రాల్లో విజయంపై ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. తమకు చాలా మంది మద్దతుగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: అమెరికా తలరాతను తేల్చేవి ఇవే...