ETV Bharat / international

డాలర్​ కలలకు బ్రేకులు​.. హెచ్​-1 బీ వీసాల సస్పెన్షన్​! - హెచ్​ 1 బి వీసా

హెచ్​-1 బీ వీసా సహా పలు ఉపాధి వీసాలను నిలిపివేసే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కరోనా సంక్షోభం, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం పెరుగదల సమస్యలతో అమెరికా సతమతమవుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Trump considering suspending H1B, other visas: report
డాలర్​ డ్రీమ్స్​కు ట్రంప్​ బ్రేక్​.. హెచ్​-1బీ వీసాల సస్పెన్షన్​!
author img

By

Published : Jun 12, 2020, 11:52 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ 'హెచ్​-1 బీ' వీసా సహా పలు ఉపాధి వీసాలను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వాల్​స్ట్రీట్​ జర్నల్ పేర్కొంది. కరోనా సంక్షోభం కారణంగా భారీ స్థాయిలో నిరుద్యోగం పెరుగుతుండడమే ఇందుకు కారణమని తెలిపింది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కేవలం పరిశీలనలో మాత్రమే ఉందని శ్వేతసౌథం ప్రకటించింది.

ఉపాధి వీసాల నిలిపివేత ప్రతిపాదన.. అమెరికా కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యే అక్టోబర్ 1 నుంచి అమలు చేసే అవకాశముందని వాల్​స్ట్రీట్​ జర్నల్ పేర్కొంది. ఫలితంగా సస్పెన్షన్ ఎత్తివేసే వరకు అమెరికాలో పనిచేయాలని కోరుకుంటున్న విదేశీ ఐటీ నిపుణులకు ఇబ్బంది తప్పదు. అయితే ఇప్పటికే అమెరికాలో పనిచేస్తోన్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలుస్తోంది.

వీటిపై ప్రభావం తప్పదు..

ట్రంప్.. ఉపాధి వీసాలను నిలిపివేయాలని భావిస్తే... హెచ్​-1బీ వీసాలతో పాటు స్వల్ప కాలం పనిచేసే కార్మికులకు ఇచ్చే హెచ్​-2బీ వీసా, క్యాంప్ కౌన్సిలర్లు, ఏయూ పెయిర్స్​కి ఇచ్చే జే-1 వీసా, కంపెనీలో అంతర్గత బదిలీలకు ఇచ్చే ఎల్​-1 వీసాలపై ప్రభావం పడే అవకాశం ఉందని వాల్​స్ట్రీట్ పేర్కొంది.

వద్దు అధ్యక్ష!

యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఈఓ థామస్ డోనోహ్యూ... అధ్యక్షుడు ట్రంప్​కు ఓ లేఖ రాశారు. తాత్కాలిక పని వీసాలను నిలిపివేయాలన్న ఆలోచన పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న అమెరికాను తిరిగి పునరుత్తేజం చేయాలంటే... స్వదేశీ నిపుణులతో పాటు, విదేశీ నిపుణుల అవసరం అత్యవసరమని ఆయన అధ్యక్షునికి గుర్తుచేశారు.

ఐటీ నిపుణులకు ఇబ్బందే..

భారత్​కు చెందిన ఎక్కువ మంది సాంకేతిక నిపుణులు ఉపాధి కోసం... హెచ్-1 బీ వీసాల ద్వారా అగ్రరాజ్యం వెళ్తుంటారు. అయితే కరోనా సంక్షోభం నేపథ్యంలో ట్రంప్ ఉపాధి వీసాలను నిలిపివేస్తే మాత్రం ఈ ఐటీ నిపుణులకు ఇబ్బంది తప్పదు. మరో వైపు చాలా మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి, అగ్రరాజ్యం నుంచి ఇంటికి తిరుగుముఖం పడుతున్నారు.

ఇదీ చూడండి: కరోనా సంక్షోభంలో ల్యాప్​టాప్​ అమ్మకాల జోరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.