ETV Bharat / international

రీకౌంటింగ్​కు ట్రంప్ బృందం విశ్వ ప్రయత్నాలు - జార్జియా రీకౌంటింగ్​

జార్జియాలో ఓట్ల రీకౌంటింగ్​కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఫలితాలను ధ్రువీకరించే ముందు 50 లక్షల ఓట్లను తిరిగి లెక్కించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు.

Trump campaign
ట్రంప్
author img

By

Published : Nov 11, 2020, 11:17 AM IST

జార్జియాలో ఓట్ల రీకౌంటింగ్​కు రిపబ్లికన్లు పట్టుబడుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్​పై 12 వేల ఆధిక్యంలో ఉన్న ప్రత్యర్థి బైడెన్​ను అధిగమించడానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముందు పలు డిమాండ్లు వినిపిస్తున్నారు. ఈ మేరకు ఫలితాలను ధ్రువీకరించే ముందు 50 లక్షల బ్యాలెట్ల రీకౌంటింగ్​కు ఆదేశించాలని రాష్ట్ర కార్యదర్శి బ్రాడ్​ రాఫెన్స్​పెర్గర్​కు లేఖ రాశారు.

రాజీనామాకు డిమాండ్..

అంతకుముందు రాఫెన్స్​పెర్గర్​ రాజీనామాకు రిపబ్లికన్లు డిమాండ్ చేశారు. జార్జియా ఎన్నికల్లో తప్పులు దొర్లినా.. ఎలాంటి పొరపాట్లు జరగలేదని ప్రకటించారని ఆరోపించారు.

తనపై వచ్చిన ఆరోపణలను పెర్గర్ కొట్టిపారేశారు. చట్టప్రకారమే ఎన్నికలు నిర్వహించామని స్పష్టం చేశారు. పదవి నుంచి దిగిపోవటానికి నిరాకరించారు.

ఇదీ చూడండి: 'ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదు- అంతిమ విజయం నాదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.