ETV Bharat / international

మాస్క్​లు ధరించే వారికే కరోనా: ట్రంప్​

మాస్క్​లు ధరించటంపై మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఫేస్​ మాస్క్​లు ధరించినవారే ఎక్కువగా కరోనా బారినపడుతున్నారని పేర్కొన్నారు. అయితే.. తాను మాస్క్​తో సౌకర్యవంతంగా ఉన్నానని పేర్కొన్న కాసేపటికే ఈ మేరకు స్పందించడం గమనార్హం.

author img

By

Published : Oct 16, 2020, 10:30 AM IST

Updated : Oct 16, 2020, 11:43 AM IST

trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​

కరోనా వైరస్​ వ్యాప్తిపై మరోమారు సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. మాస్కులు ధరించినవారే ఎక్కువగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారని పేర్కొన్నారు. మయామిలో ఎన్​బీసీ న్యూస్​ టౌన్​ హాల్​లో​ గురువారం జరిగిన కార్యక్రమంలో ఓ ప్రశ్నకు సమధానంగా ఈ మేరకు స్పందించారు ట్రంప్​.

'మాస్కులు ధరించిన వారే అన్ని వేళల వైరస్​ బారినపడుతున్నారు' అని పేర్కొన్నారు ట్రంప్​. అంతకు ముందే.. తాను మాస్క్​తో సౌకర్యవంతంగా ఉన్నట్లు పేర్కొనటం గమనార్హం. అయితే.. వ్యాధి నియంత్రణ,నిర్మూలన కేంద్రాలు మాత్రం మాస్కులు ధరించటమే సరైన మార్గమమని స్పష్టం చేస్తున్నారు.

శ్వేతసౌధంలో సెప్టెంబర్​ 26న జరిగిన భారీ బహిరంగ సభ గురించి ట్రంప్​ను అడగ్గా ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ సమావేశం ద్వారానే అధ్యక్షుడు ట్రంప్​, ప్రథమ మహిళ మెలానియా సహా సభకు హాజరైన అతిథులు, ప్రజలు వైరస్​ బారిన పడినట్లు భావిస్తున్నారు. ఇందులో చాలా మంది మాస్కులు ధరించలేదు.

బైడెన్​పై విమర్శలు...

డెమొక్రటిక్​ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​పై మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్​ ట్రంప్​. దేశ అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే బైడెన్​ అసమర్థ అభ్యర్థి అని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవాలనేది చాలా సులభమని మరోమారు ఉద్ఘాటించారు. బైడెన్​ గెలిస్తే చైనా గెలిచినట్లేనన్నారు. తాను గెలిస్తే నార్త్​కరోలినా, అమెరికా గెలుస్తుందన్నారు. బైడన్​ చాలా అవినీతి పరుడని దేశ ప్రజలకు తెలుసని ఆరోపించారు.

ఇదీ చూడండి: కరోనా విలయం.. 11 లక్షలు దాటిన మరణాలు

Last Updated : Oct 16, 2020, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.