అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల ఓటమిని అంగీకరించినట్టు కనిపిస్తోంది. ఎన్నికలు ముగిసిన రెండు వారాల తర్వాత తొలిసారి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారని బహిరంగంగా పేర్కొన్నారు ట్రంప్. అయితే.. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ తన పోరాటాన్ని ఆపనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎన్నికలపై ట్వీట్ చేశారు ట్రంప్.
-
He won because the Election was Rigged. NO VOTE WATCHERS OR OBSERVERS allowed, vote tabulated by a Radical Left privately owned company, Dominion, with a bad reputation & bum equipment that couldn’t even qualify for Texas (which I won by a lot!), the Fake & Silent Media, & more! https://t.co/Exb3C1mAPg
— Donald J. Trump (@realDonaldTrump) November 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">He won because the Election was Rigged. NO VOTE WATCHERS OR OBSERVERS allowed, vote tabulated by a Radical Left privately owned company, Dominion, with a bad reputation & bum equipment that couldn’t even qualify for Texas (which I won by a lot!), the Fake & Silent Media, & more! https://t.co/Exb3C1mAPg
— Donald J. Trump (@realDonaldTrump) November 15, 2020He won because the Election was Rigged. NO VOTE WATCHERS OR OBSERVERS allowed, vote tabulated by a Radical Left privately owned company, Dominion, with a bad reputation & bum equipment that couldn’t even qualify for Texas (which I won by a lot!), the Fake & Silent Media, & more! https://t.co/Exb3C1mAPg
— Donald J. Trump (@realDonaldTrump) November 15, 2020
"ఎన్నికల్లో రిగ్గింగ్ జరగటం వల్లే బైడెన్ గెలిచారు. ఓట్ల పరిశీలకులను అనుమతించలేదు. రాడికల్ లెఫ్ట్ ప్రైవేటు యాజమాన్య సంస్థ ఓట్లను లెక్కించింది. దానికి చడ్డ పేరు ఉంది. పరికరాలు కూడా సరిగ్గా లేవు. దుష్ప్రచారాలు జరిగాయి. వీటిపైపై మీడియా మౌనంగా ఉంది!"
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
హోరాహోరీగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి 46వ అధ్యక్షుడిగా అధికారం చేపట్టనున్నారు జో బైడెన్. పెన్సిల్వేనియాలో గెలిచి 270 మార్క్‌ను దాటిన క్రమంలో ఆయన విజయం ఖరారైంది. బైడెన్‌కు 300లకుపైగా ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. అయితే.. తన ఓటమిని అంగీకరించేందుకు నిరాకరించారు ట్రంప్. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ న్యాయపోరాటానికి దిగారు.
ఇదీ చూడండి: ట్రంప్‌కు మద్దతుగా అమెరికాలో భారీ ర్యాలీలు