ETV Bharat / international

నామినేషన్​ను అధికారికంగా​ అంగీకరించిన ట్రంప్​

అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి పోటీ చేస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా నామినేషన్​ను అంగీకరించారు. హృదయపూర్వక కృతజ్ఞతతో అమెరికా అధ్యక్షుడిగా ఈ నామినేషన్‌ను అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు.

Trump accepts Republican nomination for President
అధ్యక్ష పదవి నామినేషన్​ను స్వీకరించిన ట్రంప్​
author img

By

Published : Aug 28, 2020, 10:39 AM IST

నవంబర్​లో జరిగే అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లిక్​ పార్టీ తరపున రెండోసారి పోటీ చేస్తున్న డొనాల్డ్​ ట్రంప్​ అధికారికంగా తన నామినేషన్​ను అంగీకరించారు. మరో నాలుగు సంవత్సరాలు పదవిలో కొనసాగటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శ్వేతసౌధంలో జరిగిన రిపబ్లిక్​ కన్వెన్షన్​లో ప్రసంగించారు ట్రంప్​.​

"గత నాలుగేళ్లలో సాధించిన అసాధారణ పురోగతిపై గర్వపడుతున్నాను. ప్రజల అపూర్వ మద్దతుతో ఇక్కడ నిల్చొని ఉన్నాను. రాబోయే నాలుగేళ్లలో అమెరికా ఉజ్వలమైన భవిష్యత్తును మరో స్థాయికి తీసుకెళ్తాను."

డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.

హృదయపూర్వక కృతజ్ఞతతో నామినేషన్​ను అంగీకరిస్తున్నట్లు ట్రంప్​ తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటుందని, త్వరలోనే నిరుద్యోగులకు పూర్తి స్థాయి ఉపాధిని కల్పిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్​ పాంపియో కూడా బుధవారం తన అధికారిక నామినేషన్​ను అంగీకరించారు.

ఇదీ చూడండి అమెరికాలో 60 లక్షలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.