ETV Bharat / international

బైడెన్​ కీలక నిర్ణయం- ఆ దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత - జో బైడెన్​

Travel restrictions USA omicron: ఒమిక్రాన్​ కట్టడి కోసం దక్షిణ ఆఫ్రికాలోని 8 దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. మరోవైపు.. అగ్రరాజ్యంలో ఒమిక్రాన్​ వేరియంట్​ వేగంగా విస్తరిస్తోంది.

US to lift travel ban
ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత
author img

By

Published : Dec 24, 2021, 8:23 PM IST

Omicron travel restrictions USA: నూతన సంవత్సరం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. దక్షిణ ఆఫ్రికాలోని 8 దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు శ్వేతసౌధం శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్​ 31 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది.

కొవిడ్​-19 ఒమిక్రాన్​ వేరియంట్​ను కట్టిడి చేసే చర్యల్లో భాగంగా గత నెల ఆయా దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించింది అమెరికా. దక్షిణాఫ్రికా, బోట్స్​వానా, జింబాబ్వే, నమీబియా, లెసోతో, ఈస్వతిని, మొజాంబిక్​, మాలావి దేశాలను ఇటీవల సందర్శించిన అమెరికాయేతరులను నవంబర్​ 29 నుంచి దేశంలోకి నిషేధించింది. 'వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. తాత్కాలిక ప్రయాణ ఆంక్షలతో కొత్త వేరియంట్​ను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలకు సమయం దొరుకుతుంది. అలాగే.. ప్రస్తుత వ్యాక్సిన్లు కొత్త వేరియంట్​పై సమర్థవంతంగా పనిచేస్తున్నాయా? అని తెలుసుకునే వీలు ఉంటుంది.' అని ట్విట్టర్​ ద్వారా తెలిపారు శ్వేతసౌదం ప్రతినిధి కెవిన్​ మునోజ్​.

కరోనా వ్యాక్సిన్​ తీసుకున్నవారితో సహా దేశం మొత్తం ఒమిక్రాన్​ వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే, ఆస్పత్రుల్లో చేరుతున్నవారు అత్యధికంగా వ్యాక్సిన్​ తీసుకోనివారేనని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:

కరోనాతో అగ్రరాజ్యం విలవిల.. ఒక్కరోజే 1.81 లక్షల కేసులు

ప్రపంచాన్ని చుట్టేస్తున్న 'ఒమిక్రాన్​'- మరిన్ని దేశాల్లో ఆంక్షలు

'ఒమిక్రాన్‌' నియంత్రణకు ప్రపంచ దేశాలు అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.