ఇది ఒలింపిక్స్ సమయం. ఎక్కడకు వెళ్లినా టోక్యో ఒలింపిక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో అమెరికా ఫ్లోరిడాకు చెందిన 100 సంవత్సరాల ఎడిత్ ముర్వే- ట్రయానా.. పవర్ లిఫ్టింగ్ చేసి ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుసాధించారు. ఆగస్టు 8న 100వ జన్మదినం సందర్భంగా.. ఆమె ఈ ఘనత సాధించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఔరా అనాల్సిందే..
వందేళ్ల వయసులో.. జిమ్‌లో ఆమె చేస్తున్న వర్క్అవుట్స్ చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే.. ఈ దృశ్యాలను చూసిన నెటిజెన్లు బామ్మను తెగ ప్రశంసిస్తున్నారు.
రోజూ జిమ్‌కు వెళ్లేదాన్నని.. ప్రతిరోజూ సరికొత్త సవాళ్లను అధిగమించటం అలవాటైందని ముర్వే తెలిపారు. 'తన తల్లిని చూస్తే గర్వంగా ఉందని, ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పిందని'ముర్వే కుమార్తె హనీ కాట్రెల్ తెలిపారు. తన తల్లి ఘనత కారణంగా కుటుంబం మొత్తం గర్విస్తోందన్నారు.
గతంలో డ్యాన్స్ టీచర్‌గా పనిచేసిన ముర్వే.. తన ప్రియ స్నేహితురాలు కార్మెన్ గట్వర్త్ సలహాతో 90 ఏళ్ల వయసులో పవర్ లిఫ్టింగ్ సాధన ప్రారంభించారు.
ఇదీ చదవండి: మనవరాలి కోసం మోడల్‌గా మారిన బామ్మ