ETV Bharat / international

బెజోస్​ స్పేస్​ టూర్​పై వింత పిటిషన్- వేల మంది మద్దతు - blue origin bidding news

అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు ​సిద్ధమవుతున్న వేళ అమెజాన్​ సీఈఓ జెఫ్​ బెజోస్​పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోదసి నుంచి ఆయన మళ్లీ భూమ్మీదకు రావొద్దనే పిటిషన్​పై ఇప్పటికే 33 వేలకు పైగా మంది సంతకం చేశారు.

jeff bezos, blue origin
బ్లూ ఆరిజన్​, జెఫ్​ బెజోస్​
author img

By

Published : Jun 21, 2021, 2:48 PM IST

అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్​.. తన సోదరుడు మార్క్​తో కలిసి జులై 20న అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. సొంత సంస్థ అయిన 'బ్లూ ఆరిజన్'​ తొలిసారి చేపట్టబోయే.. మానవ సహిత రోదసి యాత్రలో ఆయన పాలుపంచుకోనున్నారు. అయితే.. ఈ యాత్రపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేలాది మంది ఏకమై.. బెజోస్​ మళ్లీ భూమికి తిరిగి రాకూడదని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం రూపొందించిన ఆన్​లైన్​ పిటిషన్​లో పెద్దఎత్తున తమ సంతకాలతో మద్దతు తెలుపుతున్నారు.

ఈ యాత్రకు సంబంధించి అనేక పిటిషన్​లు ఉన్నప్పటికీ.. అందులో జెఫ్​ బెజోస్​ మళ్లీ భూమి పైకి రాకూడదనే దానిపై ఎక్కువ మంది సంతకాలు చేశారు. ఆదివారం నాటికి ఆ పిటిషన్​పై 33,000 సంతకాలు నమోదయ్యాయి. 'బిలియనీర్లు ఉండకూడదు' అనే అంశాన్ని ఆ పిటిషన్​లో ప్రధానంగా ప్రస్తావించారు.

సీల్డ్​ బిడ్డింగ్​ పద్ధతిలో..

బ్లూ ఆరిజన్​కు చెందిన సొంత వ్యోమనౌక 'న్యూ షెపర్డ్' తొలియాత్ర జరగనుండగా.. ఇందులో సీటు కోసం ఆ సంస్థ ఆన్​లైన్​లో సీల్డ్​ బిడ్డింగ్​ పద్ధతిలో వేలం నిర్వహించింది. చివరి విడత వేలం ఈ నెల 12న జరిగింది. అత్యధికంగా 2.8 మిలియన్​ డాలర్ల బిడ్​ ఈ యాత్ర కోసం వచ్చింది. ఇందులో అత్యధిక మొత్తం బిడ్​ వేసిన వ్యక్తి, బెజోస్​ ఆయన సోదరుడు, మరో వ్యక్తి కలిసి ఈ అంతరిక్ష విహారం చేయనున్నారు.

అంతరిక్షంలో తమ ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్న వారిలో బిలియనీర్ బెజోస్​ ఒక్కరే కాదు.. టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​, వర్జిన్ గ్రూప్​ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్​ వంటివారూ ఉన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.