ETV Bharat / international

అమెరికా రోడ్డు ప్రమాదంలో అసలు నిజాలు - California's border SUV

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై అధికారులు ఆరా తీసేకొద్ది మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వలస స్మగ్లింగ్​ జరగుతుండగా ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో చనిపోయిన 13 మందిలో 10 మంది మెక్సికోకు చెందిన వారేనని బార్డర్​ పెట్రోలింగ్​ అధికారులు తెలిపారు.

SUV in crash came through hole in border fence
'వారంతా అక్రమంగా అమెరికాలోకి వచ్చారు'
author img

By

Published : Mar 4, 2021, 5:25 AM IST

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో మంగళవారం జరిగిన ఎస్​యూవీ కారు ప్రమాద బాధితుల్లో మెక్సికోకు చెందిన వారున్నట్లు అధికారులు గుర్తించారు. వారంతా సరిహద్దులో ఉన్న కంచెను కత్తిరించి వచ్చినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది మరణించినట్లు పేర్కొన్నారు. వీరంతా వలస స్మగ్లింగ్ ఆపరేషన్​లో భాగమని తెలిపారు.

ఈ స్మగ్లింగ్​తో సంబంధం ఉన్నవాళ్లు మొత్తం 44 మంది కాగా... వారిలో సబర్బన్​లో వచ్చిన19 మంది పెట్రోలింగ్​ అధికారులకు దొరికిపోయారు. మరో 25 మంది ఉన్న ఎస్​యూవీ.. పెట్రోలింగ్​ సిబ్బందికి చిక్కకుండా తప్పించుకుంది. అనంతరం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో చనిపోయిన 13 మందిలో 10 మందిని మెక్సికన్ పౌరులుగా గుర్తించారు. ఎస్‌యూవీలో మిగిలిన వారు, ట్రక్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని బార్డర్​ పెట్రోలింగ్​ పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. తరచుగా కంచె దాటుతూ పలువురు విషాదంలో చిక్కుకుంటున్నారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో ఊహించని ట్విస్ట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.