ETV Bharat / international

మార్స్​పై గాలి శబ్దాలు రికార్డు చేసిన నాసా రోవర్

ఇటీవలే అంగారకుడిపై అడుగుపెట్టిన నాసా పర్సెవరెన్స్ రోవర్... సూపర్​క్యామ్​ సాయంతో మార్స్​పై ఉన్న గాలి శబ్దాలను రికార్డు చేసింది. ఫ్రెంచ్​ స్పేస్​ ఏజెన్సీకి ఐదు ఆడియో రికార్డింగ్స్​ పంపింది.

author img

By

Published : Mar 11, 2021, 4:09 PM IST

NASA rover captures Martian sounds for 1st time
మార్స్​పై గాలి శబ్దాలు రికార్డు చేసిన నాసా రోవర్

అంగారకగ్రహంపై అడుగుపెట్టిన అమెరికా వ్యోమనౌక 'పర్సెవరెన్స్'... మొదటిసారిగా మార్స్​పై ఉన్న గాలి శబ్దాలను రికార్డు చేసి పంపింది. ఫ్రెంచ్​ అంతరిక్ష పరిశోధనా సంస్థకు ఐదు ఆడియో ఫైల్స్​ను షేర్ చేసింది. వ్యోమనౌకలో అమర్చిన సూపర్​క్యామ్​ ద్వారా ఇది సాధ్యమైందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

"అంగారక గ్రహంపై సూపర్​క్యామ్ పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఎనిమిదేళ్ల క్రితం మొదటిసారి ఈ పరికరం తయారు చేయాలని సంకల్పించాం. ఇప్పుడు ఇది మెరుగ్గా పనిచేస్తోంది."

-రోజర్ వియెన్స్, సూపర్​క్యామ్​ ప్రధాన సృష్టికర్త.

మార్స్​ రోవర్ ల్యాండ్​ అయిన మొదటి 18 గంటల తర్వాత అంగారక గ్రహంపై గాలి శబ్దాలు రికార్డు అయినట్లు మొదటి ఆడియో ఫైల్​లో తెలుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. గాలి శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. లేజర్​ సాంకేతికతతో పనిచేసే ఈ సూపర్​క్యామ్​ను ఇతర గ్రహంపై ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

సూపర్​క్యామ్​ను లాస్​ అలామోస్ నేషనల్ లాబొరెటరీ, కొన్ని ఫ్రెంచ్​ పరిశోధన​ సంస్థలు సంయుక్తంగా తయారు చేశాయి. అంగారకుడిపై ఒకప్పుడు జీవజాలం ఉందా? లేదా? అని పరిశోధన చేసేందుకు అమెరికా ఈ వ్యోమనౌకను పంపింది. ఇందుకు సంబంధించి నాసా ఇటీవలే కొన్ని వీడియోలు కూడా విడుదల చేసింది.

ఇదీ చదవండి:

మార్స్​పై రోవర్‌ దిగిన అద్భుత దృశ్యాలు

అంగారకుడి ఉపరితలం చిత్రాలను పంపిన రోవర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.